రావణుడి పాత్ర పోషించిన 10 యాక్టర్స్ వీళ్ళే !

సినీ ఇండస్ట్రీలో ఒకరి పాత్ర పోషించాలంటే చాలా ధైర్యం కావాలి.ఇక రామాయణం లాంటి కథల్లో నటించాలంటే చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

రామాయణంలో రావణుడి పాత్ర గురించి అందరికి తెలుసు.ఈ పాత్రలపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.

రామాయణంలో రావణుడు విలన్ అయినప్పటికీ ఎన్నో సుగుణాలు కలవాడు.అంతెందుకు శివుడికి రావణుడు ఎంత పెద్ద భక్తుడో అందరికి తెలిసిందే.

కానీ సీతని ఎత్తుకెళ్లిన కారణంగా శ్రీ రాముడి చేతిలో హతమయ్యాడు.ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది రావణుడి పాత్రని అద్భుతంగా పోషించారు.

వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.ఎన్టీఆర్: ( NTR )ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచేయం చేయాల్సిన అవసరం లేదు.

ఎన్టీఆర్ చేయని పాత్ర అంటూ లేదు.ప్రతి పాత్రలో ప్రాణం పెట్టి నటించేవారు.

కృష్ణుడి పాత్ర వేసినప్పుడు థియేటర్ లు దద్దరిల్లాయి.ఎన్టీఆర్ రావణుడి పాత్ర కూడా పోషించారు.

శ్రీరామ పట్టాభిషేకం’, ‘సీతారామ కళ్యాణం, ఇంకా ఎన్నో చిత్రాల్లో రావణుడి పాత్రలో నటించి మెప్పించారు.

"""/" / ఎస్వి రంగారావు:( SV Ranga Rao ) సినీ ఇండస్ట్రీలో ఎస్వి రంగారావుని మర్చిపోగలమా.

ఆయన చేసిన పాత్రలు, సినిమాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి.ఎస్వి రంగారావు కూడా సంపూర్ణ రామాయణం చిత్రంలో రావణుడి పాత్రలో మెప్పించారు.

"""/" / అశుతోష్ రాణా:( Ashutosh Rana ) ఈయన రామాయణ: ది ఎపిక్ మూవీలో రావణుడి పాత్రలో నటించారు.

"""/" / కైకాల సత్యనారాయణ:( Kaikala Satyanarayana ) ఈయన గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.

ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.కైకాల సత్యనారాయణ సీతా కళ్యాణం సినిమాలో రావణుడి పాత్రలో అద్భుతంగా నటించారు.

"""/" / సీత: ( Sita )ఏంటి అమ్మాయి పేరు చెబుతూ రావణుడి పాత్ర చేసారు అని చెబుతున్నాం అనుకుంటున్నారా, 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమా గుర్తుందా.

ఈ సినిమాలో రాముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటించగా రావణుడిగా సీత బాలినేని అనే బాలిక నటించింది.

"""/" / సైఫ్ అలీఖాన్: ( Saif Ali Khan )ఈ సంవత్సరం భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.

ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించగా రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. """/" / అరవింద్ త్రివేది: ( Arvind Trivedi )రామాయణ’ సీరియల్‌ ను అప్పుడే ఎవ్వరు మర్చిపోలేరు.

ఈ సీరియల్ లో అరవింద్ త్రివేది రావణుడి పాత్రలో నటించి ప్రేక్షకుల గుండెల్లో స్తానం సంపాదించుకున్నారు.

"""/" / రాజ్ కుమార్:( Raj Kumar ) కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గురించి అందరికి తెలిసిందే.

భూ కైలాస్ చిత్రంలో రాజ్ కుమార్ రావణుడిగా నటించారు. """/" / నాగబాబు:( Naga Babu ) మెగా బ్రదర్ నాగబాబు కూడా రావణుడి పాత్రలో కనిపించారు.

శ్రీ రామదాసు సినిమాలో రావణుడి పాత్రలో అద్భుతంగా నటించారు. """/" / ఓం పురి:( Om Puri ) భారత్ ఏక్ ఖోజ్ మూవీలో ఓం పురి రావణుడిగా పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

"""/" / .

1 నేనొక్కడినే సినిమా కోసం పెద్ద సాహసం చేసిన మహేష్… అయినా ఫలితం లేదుగా!