అన్నదానంలోనూ సింపుల్ గా కనిపించి ఆకట్టుకున్న యశ్.. ఇలాంటి స్టార్ హీరోలు ఉంటారా?

కోలీవుడ్ పాన్ ఇండియా హీరో కేజిఎఫ్ నటుడు యష్ ( Actor Yash )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

యష్ వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కేజిఎఫ్.కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మారిపోయాడు యష్.

ఈ మూవీ రెండు పార్ట్ లుగా విడుదల అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత యష్ రేంజ్ మారిపోయింది.

పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న యష్ తన తర్వాత సినిమాని మాత్రం ఇప్పటివరకు ప్రకటించింది లేదు.

కాగా కేజీఎఫ్ 2 ( KGF 2 )వచ్చి కూడా దాదాపుగా రెండేళ్లు దాటిపోయింది.

అయినా కూడా హీరో యష్ ఎక్కడా కనబడట్లేదు. """/" / టాక్సిక్ ( Toxic )అనే మూవీ చేస్తున్నాడని అన్నారు గానీ లుక్ లాంటిదేం బయటకు రాలేదు.

కానీ తాజాగా కర్ణాటక ( Karnataka )లోని ప్రముఖ దేవాలయాల్ని కుటుంబంతో సందర్శిస్తూ కనిపించాడు.

సామాన్యుడిలా దర్శనం చేసుకోవడమే కాదు,అన్నదానంలోనూ సింపుల్‪‍‌గా కనిపించి ఆశ్చర్యపరిచాడు.అయితే ఒక పాన్ ఇండియా హీరో అయినప్పటికీ ఇలాంటి హంగులు ఆర్భాటలు లేకుండా సామాన్యుడిలా, సింపుల్ గా పద్ధతిగా పంచ కట్టుకొని, అందరితో కలిసి భోజనం చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

నిజంగా రియల్ సూపర్ హీరో ఇలాంటి హీరోలు కూడా ఉంటారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కేజీఎఫ్ తర్వాత యష్ ఎలాంటి సినిమా చేస్తాడా? ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇందుకు తగ్గట్లే టాక్సిక్ అనే మూవీని యష్ ప్రకటించాడు.కానీ ఇప్పటి వరకు అసలు షూటింగ్‌ లోనే పాల్గొనలేదు.

తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. """/" / కాగా ఆగస్టు 8 నుంచి యష్‍‌ కి సంబంధించిన షూటింగ్ మొదలవుతుందని నిర్మాతలు ప్రకటించారు.

యష్‌కి బాగా కలిసొచ్చిన సంఖ్య 8.జనవరి 8వ తేదీన పుట్టాడు.

బహుశా అందుకేనేమో ఈ నంబర్ కలిసొచ్చేలా ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖున షూటింగ్‌కి వెళ్లాలని ఇన్నాళ్లు ఆగినట్లున్నాడు.

మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తీస్తున్న టాక్సిక్.కాగా గ్యాంగస్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

కూతురి విజయం పై ఎమోషనల్ అయిన హీరో సూర్య… ఏమైందంటే?