'స్టార్ కమెడియన్'కు గుండెపోటు.. పరిస్థితి విషమం!
TeluguStop.com
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రపంచమంతా ఎంత తీవ్రంగా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే.
ఇప్పటికే చాలా చోట్ల కరోనా విజృంభణ ఎక్కువగా ఉండటంతో పలుచోట్ల కరోనా వ్యాక్సిన్ టీకాలను అందిస్తున్నారు.
ఇక ఈ టీకాలు తీసుకున్నవారికి పలు సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మరో స్టార్ కమెడియన్ కు కూడా గుండె పోటు కారణం వ్యాక్సిన్ అని తెలుస్తుంది.
ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్.ఈయన తమిళంలో ఎన్నో సినిమాలలో నటించాడు.
అంతే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఈయన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా ఆయన పరిస్థితి ప్రస్తుతం విషయం గా ఉందని వైద్యులు తెలుపుతున్నారు.
"""/"/
ఈయన గురువారం చెన్నై ఓమందూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
అంతేకాకుండా వైద్య సిబ్బంది లకు కృతజ్ఞతలు తెలుపుతూ.ఈ టీకా మాత్రమే ప్రాణాలను కాపాడుతుందంటూ.
తన ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే.కానీ టీకా తీసుకున్న తర్వాత రోజే శుక్రవారం ఆయనకు తీవ్ర చాతి నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.
కార్డియాక్ అరెస్ట్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇక ఈయన కరోనా వ్యాక్సిన్ టీకా తీసుకున్న మరుసటి రోజే.గుండెపోటు రావడం అందర్నీ కలకలం రేపింది.
ఈ విషయం గురించి ఎటువంటి స్పష్టత రాకపోగా.ప్రస్తుతం ఆయనకు చికిత్స చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇదివరకే పలువురు నటీనటులు వ్యాక్సిన్ తీసుకోగా.ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేవని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ టీకా లను తీసుకోవాలని తెలిపిన సంగతి తెలిసిందే.
కానీ ఇప్పటివరకు చాలామంది టీకా తీసుకోగా.ఎవరి లో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రాలేవని.
కానీ కొంత జ్వరం వంటివి వచ్చాయని తెలిపారు.
ఈ టాలీవుడ్ లక్కీ హీరోయిన్ టాలెంట్ ఏంటో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాకవ్వాల్సిందే!