ట్విట్టర్ ట్రెండింగ్ లో నటుడు విజయ్… మరీ ఇంత ఫాలోయింగా?
TeluguStop.com
సాధారణంగా సినిమా హీరో హీరోయిన్లకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వారి సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులను సొంతం చేసుకుంటారు.
ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ప్రేక్షకాభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ నటుడిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయనకు ట్విట్టర్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
అయితే గత 15 రోజులుగా ట్విట్టర్ లో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్న వారిలో విజయ్ ఒకరు.
గత 15 రోజులుగా ట్విట్టర్ వేదికగా విజయ్ గురించి ఏకంగా 1.72 మిలియన్ల మంది ప్రస్తావించడం గమనార్హం.
గతంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి 1.52 మిలియన్ల మంది ఇలా ట్విట్టర్ వేదికగా ప్రస్తావించగా ఆ రికార్డును విజయ్ చెరిపేసారని చెప్పాలి.
"""/"/
ఇకపోతే విజయ్ నటిస్తున్న వారసుడు సినిమా గురించి పెద్ద ఎత్తున ట్విట్టర్ వేదికగా అభిమానులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే దిల్ రాజు నిర్మాణంలో తెలుగు తమిళ భాషలలో వారసుడు అనే సినిమా ద్వారా ఈయన వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.