సమంత చైతన్యలపై వెంకీ రియాక్షన్ ఇదే.. మైండ్ తో ఆలోచించాలంటూ?

టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న నాగచైతన్య, స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్న సమంత విడాకుల ప్రకటన చేసిన తర్వాత వీరి ప్రకటనకు సంబంధించి సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు.

స్పందిస్తున్న సెలబ్రిటీలలో కొందరు తప్పంతా సమంతదేనని చెబుతుంటే మరి కొందరు నాగచైతన్య తప్పు చేశాడని కామెంట్లు చేస్తున్నారు.

అయితే చైసామ్ నిర్ణయం గురించి హీరో వెంకటేష్ సైతం స్పందించారు.మనం ఏ విషయం గురించైనా పెదవి విప్పడానికి ముందు మైండ్ తో ఆ విషయం గురించి క్షుణ్ణంగా ఆలోచించాలని వెంకటేష్ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

తాజా పరిస్థితులను బట్టి వెంకటేష్ ఈ పోస్ట్ పెట్టారనే కామెంట్లు సైతం వినిపిస్తుండటం గమనార్హం.

చూడముచ్చటగా ఉండే సమంత చైతన్యల జోడీ విడిపోవడం గురించి నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

సమంత, చైతన్య విడిపోవడం సరైన నిర్ణయం కాదని చాలామంది భావిస్తున్నారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/10/actor-venkatesh-comments-a-chaitanya-samantha-orce-issue-tollywod!--jpg "/ విడాకుల ప్రకటన తర్వాత సమంత భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి చాలా వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల్లో ఏ వార్త నిజమో ఏ వార్త అబద్ధమో తెలియడం లేదు.

గతంతో పోలిస్తే సమంత సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండటం లేదు.

సమంత తీసుకున్న నిర్ణయం ప్రభావం ఆమె కెరీర్ పై ఎక్కువగానే పడే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కెరీర్ విషయంలో సమంత ఆచితూచి అడుగులేస్తున్నారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/10/comments-a-chaitanya-samantha-orce-issue-tollywod!--jpg "/ ప్రముఖ హీరో రాజీవ్ కనకాల సైతం చైసామ్ విడాకుల గురించి చెబుతూ అది వాళ్ల వ్యక్తిగతమని కామెంట్లు చేశారు.

చైతన్య సమంతల జీవితం గురించి స్పంచే అర్హత మనకు లేదని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

సమంత చైతన్య భవిష్యత్తులో కలిసి నటించే అవకాశాలు కూడా దాదాపుగా లేవని తెలుస్తోంది.

మా అమ్మ గురించి మీకేం తెలుసు.. పవిత్ర గౌడ కూతురు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!