ఈయన విలన్ గా నటిస్తే సినిమా హిట్ కావాల్సిందే… హిట్ లిస్ట్ ఇదిగో?

సినీ ఇండస్ట్రీలో చాలామంది ఎన్నో సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు.ఫలానా హీరో లేదా ఫలానా నటుడు సినిమాలలో నటిస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం చాలా మందిలో ఉంటుంది.

అలాగే సినిమాకు ఎలాంటి టైటిల్ పెడితే సినిమా సూపర్ హిట్ అని ఫలానా తేదీలలో విడుదలయితే సూపర్ హిట్ అంటూ చాలామంది కొన్ని సెంటిమెంట్లను పెట్టుకొని ఉంటారు.

అయితే ప్రస్తుతం మాత్రం ఓ నటుడు ఏదైనా సినిమాలో విలన్ గా నటిస్తే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ మరొక హిట్ సెంటిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరి ఆ నటుడు ఎవరు, ఆయన నటించిన సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే.

"""/" / తారక్ పొన్నప్ప (Tarak Ponnappa) పేరు చెబితే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ ఈయనని చూస్తే మాత్రం అందరికీ ఎంతో సుపరిచితమైన వ్యక్తి అనే భావన కలుగుతుంది.

తారక్ పొన్నప్ప స్వతహాగా కన్నడ యాక్టర్ అయినా.తెలుగులో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారుగా.

ఈయన ఎక్కువగా విలన్ పాత్రలలోనే నటిస్తున్నారు.ఈయన నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం విశేషం.

పలు రియాలిటీ షోలు చేసుకుంటూ కన్నడ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ఈయన కే జి ఎఫ్ (KGF) సినిమాలో నటించారు.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది దీంతో తెలుగు దర్శకులపై ఈయన కనబడింది.

"""/" / ఈ క్రమంలోనే కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన దేవర (Devara) సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక తాజాగా సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2(Pushpa 2) సినిమాలో బుగ్గారెడ్డి (Bugga Reddy)అనే విలన్ పాత్రలో నటించారు.

ఈయన లోకల్ సినిమాలు కాకుండా నాలుగు పాన్ ఇండియా సినిమాలలో నటించారు.అయితే ఈ నాలుగు సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి.

ఇలా విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయన సినిమాలకు లక్కీ చార్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో: పాడుబడిన ఇంట్లో వెతుకుతుంటే ఊహించని ట్విస్ట్.. గోడల్లో నిధి చూసి షాక్!