అల్లు అర్జున్ అలాంటి కష్టాలు పడ్డారా.. నచ్చిన తిండి తినకుండా..?

మనలో చాలామంది స్టార్ హీరోలంటే రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటారని, వారికి ఎటువంటి కష్టాలు ఉండవని భావిస్తారు.

అయితే రియాలిటీ మాత్రం భిన్నంగా ఉంటుంది.స్టార్ హీరోలు సినిమాల్లో అందంగా కనిపించడానికి, కొన్ని సీన్లలో నటించడానికి పడే కష్టం అంతాఇంతా కాదు.

ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటూ ఆహారపు నియమాలను పాటించే టాలీవుడ్ హీరోలు చాలామంది ఉన్నారు.

గంగోత్రి సినిమా నుంచి అల వైకుంఠపురములో సినిమా వరకు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ గురించి తనికెళ్ల భరణి కీలక వ్యాఖ్యలు చేశారు.

గంగోత్రి సినిమా నుంచి తాను అల్లు అర్జున్ ను సినిమాల్లో చూస్తున్నానని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.

ఐకాన్ స్టార్ బన్నీ డ్యాన్స్ కోసం పడే కష్టం మామూలు కష్టం కాదని తనికెళ్ల భరణి పేర్కొన్నారు.

అల్లు అర్జున్ డ్యాన్స్ కోసం చెమటోడుస్తారని తెలిపారు. """/"/ ఒక్క స్టెప్పు రాంగ్ వచ్చినా మళ్లీ స్టెప్పులు వేస్తారని అల్లు అర్జున్ పక్కనే ఒకడు రాక్షసుడులా ఉంటాడని వాడు అల్లు అర్జున్ ను వాళ్లు తిననివ్వరని తాగనివ్వరని తనికెళ్ల భరణి అన్నారు.

శరీరం ఆకృతిని కాపాడుకోవడానికి హీరోలు పడే శ్రమ మామూలు శ్రమ కాదని తనికెళ్ల భరణి అన్నారు.

హీరోలు అంత శ్రమిస్తున్నారు కాబట్టి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వవచ్చని తనికెళ్ల భరణి తెలిపారు.

"""/"/ హీరోయిన్లు ఐస్ క్రీమ్ తినడానికి కూడా ఆలోచిస్తారని తనికెళ్ల భరణి అన్నారు.

గతంలో శ్రీదేవిలా పుట్టకూడదని శ్రీదేవి చెల్లెలిలా పుట్టాలనే జోక్ ఉండేదని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు ఫిట్ గా కనిపించడం కోసం పడే కష్టం మామూలు కష్టం కాదనే సంగతి తెలిసిందే.

మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ సైతం యంగ్ లుక్ లో కనిపించడానికి ఎంతో శ్రమిస్తున్నారు.

దశాబ్ధాలుగా ఉంటున్నా , ఓటు వేస్తున్నా.. నేను అమెరికా పౌరుడిని కాదంట, ఓ పెద్దాయన ఆవేదన