తెలుగు ప్రేక్షకులకు సందీప్‌ కిషన్‌ బంపర్ ఆఫర్‌.. ఏమిటంటే?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్నాడు.

తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా నటించాడు.ఇక ఈయన గౌతమ్ మీనన్ దగ్గర సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు.

ఇక 2008 లో స్నేహగీతం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇదిలా ఉంటే తెలుగు ప్రేక్షకులకు సందీప్ కిషన్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

ఇక ఇటీవలే సందీప్ కిషన్ నిర్మాతగా వివాహ భోజనంబు అనే సినిమాను నిర్మించాడు.

అంతేకాకుండా ఇందులో ఓ కీలక పాత్రలో కూడా నటించాడు సందీప్ కిషన్.సత్య హీరోగా నటించగా ఈ సినిమాను రామ్ అబ్బరాజు రూపొందించాడు.

ఇక ఈ సినిమా ఆగస్టు 27న ఓటీటీ వేదికగా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ తెలుగు ప్రేక్షకులకు కొన్ని విషయాలు పంచుకున్నాడు.

వివాహ భోజనంబు సినిమా వినోదాత్మక సినిమా అని.రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్విస్తుందని తెలిపాడు.

"""/"/ ఈ సినిమాకు పనిచేసిన దర్శకులకు, నటులకు, సాంకేతిక బృందాలకు ధన్యవాదాలు తెలిపాడు.

ఇక ఇందులో కొత్త వారిని పరిచయం చేస్తున్నందుకు నిర్మాతగా తాను ఆనంద పడుతున్నాను అని తెలిపాడు.

"""/"/ తను ఇలా ఉండటానికి కారణమైన తెలుగు ప్రేక్షకులతో సినిమా సంబరాలను మరింతగా జరపాలని అనుకుంటున్నానని తెలిపాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ పోస్టర్ తో ఫ్యామిలీ ఫోటోలను జతచేసి షేర్ చేయమని తెలిపాడు.

ఇక సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ లో తన నుంచి బహుమతిని అందుకోమని తెలిపాడు.

ఇక అలా పోస్ట్ చేసిన మొదట వెయ్యి మందికి సోనీ లివ్ సబ్ స్క్రీప్షన్ ను ఉచితంగా అందిస్తానని తెలిపాడు సందీప్ కిషన్.

కొంచెం కంటెంట్ మీద ఫోకస్ పెట్టాండయ్య…లేకపోతే ఇక అంతే సంగతి…