Actor Suman : ఏపీ రాజకీయాలపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు..!
TeluguStop.com
ఏపీ రాజకీయాలపై సినీ నటుడు సుమన్( Actor Suman ) కీలక వ్యాఖ్యలు చేశారు.
సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ - జనసేనదే( TDP-Janasena ) విజయమని తెలిపారు.
వైసీపీకి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయన్న ఆయన తన రాజకీయ గురువు టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu Naidu ) అని తెలిపారు.
బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు.తాను తెలంగాణ వ్యక్తిని కాబట్టి పోటీ చేయనని చెప్పానన్నారు.
పరిపాలనా బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.ఏపీలో మహిళలకు రక్షణ లేదు, అఘాయిత్యాలు పెరిగాయని ఆరోపించారు.
రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు.