రోడ్డు మధ్యలో కారుని ఆపి ఇష్టమొచ్చినట్టు డ్యాన్స్ చేసిన కమెడియన్ సునీల్

సినిమా ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలదొక్కుకోవడం చాలా కష్టం.

అలా ఎంతో మంది సినిమా మీద పిచ్చి తో కృష్ణ నగర్ లో తిరుగుతూ ఇంకా జూనియర్ ఆర్టిస్టులుగానే కొనసాగుతూ, చాలీచాలని డబ్బులతో జీవితాన్ని గడుపుతున్నారు.

ఒక్క అవకాశం అయినా రాకుండా పోతుందా అని వాళ్ళ ఆశ.అయితే కొంత మందికి అదృష్టం ఉండడం వల్ల సినిమాల్లోకి ఎంట్రీ దొరికింది.

నేడు పెద్ద స్టార్స్ గా కొనసాగుతున్నారు.వారిలో సునీల్ మరియు త్రివిక్రమ్ కూడా ఒకరు.

భీమవరం నుండి వచ్చిన ఈ ఇద్దరు కెరీర్ ప్రారంభం లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

పంజాగుట్ట వద్ద ఉన్న ఒక రూమ్ లో అద్దెకి దిగిన వీళ్ళు అప్పట్లో అద్దె కట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు, తినడానికి తిండి కూడా ఉండేది కాదు.

అలాంటి పరిస్థితుల నుండి నేడు ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ కమెడియన్ గా సునీల్,( Comedian Sunil ) టాప్ మోస్ట్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ ( Director Trivikram ) నిలిచారు.

"""/" / అయితే వీళ్లిద్దరు ప్రముఖ నటుడు సుబ్బరాజు తండ్రి కి స్టూడెంట్స్ అట.

వాళ్ళతో ఉన్న అనుబంధం గురించి సుబ్బరాజు( Subbaraju ) రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ 'త్రివిక్రమ్ మరియు సునీల్ వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితులు.భీమవరం లో వీళ్ళు మా నాన్నగారికి స్టూడెంట్స్.

నేను పెద్దగా అప్పట్లో బయట తిరిగేవాడిని కాదు, కానీ వీళ్ళు నన్ను బలవంతంగా సినిమాలకు తీసుకెళ్లేవారు, అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేవాళ్ళం.

సునీల్ బాగా అల్లరి మనిషి, రోడ్ల మీద కార్లు ఆపి డ్యాన్స్ వేసేవాడు.

వీళ్లిద్దరు నాకంటే ముందుగానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.నాకు కూడా చిన్నప్పటి నుండి సినిమా యాక్టర్ అవ్వాలని ఉండేది.

త్రివిక్రమ్ రచయితగా స్థిరపడ్డాడని తెలిసి, తనని కలిసే ఉద్దేశ్యం తో ఆయన రూమ్ క్రింద నిలబడేవాడిని, ఒకరోజు చూసి నన్ను లోపలకు పిలిచాడు.

చాలాసేపు మాట్లాడాడు, సినిమా ఇండస్ట్రీ లో నిలబడడం చాలా కష్టం రా అనేశాడు.

ఇదేంటి నాకు ఆయన సినిమాల్లో అవకాశం ఇప్పిస్తాడు అనుకుంటే ఇలా అనేశాడు అని అనుకున్నాను, ఇండస్ట్రీ లో జరిగే వాస్తవాలను ఆరోజు చెప్పాడు' అంటూ సుబ్బరాజు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

"""/" / అలా ఎన్నో ఒడిదుడుకుల నడుమ ప్రారంభమైన ఈ ముగ్గురి కెరీర్ ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఏ రేంజ్ లో ముందుకు దూసుకుపోతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

సునీల్ కమెడియన్ , హీరో గా మరియు విలన్ గా కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాడు.

మరోపక్క సుబ్బరాజు క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి డిమాండ్ తో ముందుకు దూసుకుపోతున్నాడు.ఇక త్రివిక్రమ్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది, టాలీవుడ్ లో టాప్ 3 డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు, ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల కాబోతుంది.

ఇప్పటికీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అలా వైకుంఠపురం లో' సినిమానే కొనసాగింది.

ఇప్పటి వరకు ఎన్ని సూపర్ హిట్స్ వచ్చినా ఈ చిత్రం రికార్డ్స్ బ్రేక్ అవ్వలేదు, మళ్ళీ త్రివిక్రమే ఈ రికార్డ్స్ ని బద్దలు కొట్టబోతున్నాడని ఆయన అభిమానులు చెప్తున్నారు.

ఈ సింపుల్ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!