Actor Sri Ram: నా సొంత అన్న చనిపోయాడు.. ఉన్నప్పుడు విలువ తెలియలేదు.. శ్రీరామ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరో నటుడు శ్రీరామ్( Actor Sri Ram ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

శ్రీరామ్ మొదట రోజాపూలు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అప్పట్లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

ఇక రోజా పూలు సినిమా ( Roja Poolu Movie ) తరువాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికొకరు లాంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.

తరువాత టెన్త్ క్లాస్ డైరీస్ చిత్రంలో నటించారు.కేవలం తెలుగులో మాత్రం కాకుండా తమిళం మలయాళం సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్.

తెలుగులో ఒకరికొకరు, శ్రీనివాస కళ్యాణం, లై, సీత, సుప్రీమ్, నమస్తే నేస్తమా, అసలేం జరిగింది, మహా ఇలా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు శ్రీరామ్.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరామ్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నేను మొదట ఐదవ తరగతి చదివే సమయంలో ఒక నాటకం ద్వారా సినిమా ఇండస్ట్రీకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చాను.

ఒక నాటకం వేసే సమయంలో ఒక అతను కొన్ని కారణాల వల్ల లేకపోవడంతో మా నాన్న చెప్పినట్టుగా నేను అందులో నటించాను.

"""/" / ఆ నాటకం బాగా సూపర్ హిట్ అవడంతో అవార్డు లభించింది అలా నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం అయ్యింది అని తెలిపారు శ్రీరామ్.

అలా నెమ్మదిగా సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాను అని తెలిపారు.అనంతరం తన అన్నయ్య( Actor Sri Ram Brother ) గురించి యాంకర్ ప్రశ్నించగా.

నేను అన్నయ్య అయితే అన్నయ్య చనిపోయారు.తను అమెరికాలో 15,16 ఏళ్లు ఉన్నారు.

నాకు హైదరాబాద్ అంటే ప్రాణం.ఎప్పటికైనా హైదరాబాదుకు( Hyderabad ) వచ్చేయాలని అనుకున్నారు.

కానీ డెంగ్యూ ఫీవర్( Dengue Fever ) కారణంగా ఆయన మరణించారు.ఆయన ఉన్నప్పుడు విలువ తెలియలేదు.

"""/" / అన్నయ్య చనిపోవడం ఎంతో బాధ కలిగించింది.చిన్నప్పటి నుంచి నాకు మా అన్నయ్యకు అస్సలు పడేది కాదు.

నాకు క్రికెట్ అంటే పిచ్చి.మేము క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు కూడా నన్ను మా అన్నను వేరువేరు గ్రూపుల్లో వేసేవాళ్ళు.

అంతలా ఇద్దరు కొట్టుకునే వాళ్ళం.కానీ ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఆయన గుర్తుగా ఆయనకు చేతికి ఉన్న కడియాన్ని( Bracelet ) నేను వేసుకుంటున్నాను అని చేతిలో ఉన్న కడియంని కూడా చూపించారు శ్రీ రామ్.

ఈ సందర్భంగా శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సిటీ లైఫ్ అంత డేంజరా.. ద్వీపంలో 32 ఏళ్లు బతికిన వ్యక్తి.. తిరిగొచ్చిన కొన్నేళ్లకే..?