ఎవరికీ తెలీకుండా చిరంజీవి డబ్బులిచ్చారన్న శివాజీ.. ఆ తర్వాత అలా చెప్పారంటూ?
TeluguStop.com
ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ( Shivaji ) తెలుగులో మళ్లీ వరుస సినిమా ఆఫర్లతో బిజీ కావాలని భావిస్తున్నారు.
ఫుల్ లెంగ్త్ రోల్ లో మంచి పాత్రల్లో నటించాలని ఆయన కోరుకుంటున్నారు.ఒక ఇంటర్వ్యూలో మంచి వేషం అయితే నేను కచ్చితంగా చేస్తానని నేను ఇష్టపడే డైరెక్టర్లను అవకాశాలు ఇవ్వాలని అడుగుతున్నానని శివాజీ చెప్పుకొచ్చారు.
సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆఫర్లు నా దగ్గరకు వచ్చాయని ఆయన తెలిపారు.
"""/" /
తేజ గారిని ఇప్పటికీ ఆఫర్లు అడుగుతుంటానని చిత్రం సినిమాలో ఉదయ్ కిరణ్( Uday Kiran ) రోల్ కు డబ్బింగ్ చెప్పానని శివాజీ తెలిపారు.
నువ్వు నేను సినిమాకు ఛాన్స్ వస్తుందని అనుకున్నానని కానీ రాలేదని ఆయన తెలిపారు.
చేతనైతే నలుగురికి సహాయం చేయాలని సాటివాళ్లను ప్రేమించాలని శివాజీ చెప్పుకొచ్చారు.నా పిల్లలు పెద్దోళ్లు అవుతున్నారని ఆయన కామెంట్లు చేశారు.
"""/" /
రామారావు కోట్లు సంపాదించాడు తీసుకుపోయాడా? అని శివాజీ అన్నారు.చిరంజీవి( Chiranjeevi ) గారు నేను ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని తెలిసి 10,000 రూపాయలు ఇచ్చి సాయం చేశారని ఆయన తెలిపారు.
ఏడాది పాటు ఇబ్బంది పడకుండా చిరంజీవి సహాయం చేశారని ఆయన తెలిపారు.నేను ఇబ్బందులు పడుతున్నా నా వంతు సహాయం చేస్తున్నానని శివాజీ చెప్పుకొచ్చారు.
నేను చిరంజీవికి దగ్గర కావడం కొంతమందికి నచ్చక నా గురించి తప్పుగా చెప్పారని శివాజీ పేర్కొన్నారు.
"""/" /
ఆ విధంగా చిరంజీవితో గ్యాప్ పెరిగిందని ఆయన పరోక్షంగా తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అదే విధంగా గ్యాప్ వచ్చిందని శివాజీ చెప్పుకొచ్చారు.
సీనియర్ ఎన్టీఆర్ నన్ను వాటేసుకున్నారని నా స్పీచ్ ఆయనకు నచ్చిందని శివాజీ తెలిపారు.
నాగార్జున గారు నవ్వుతూ మాట్లాడారని, వెంకటేష్ బాబు గారు మంచిగా మాట్లాడతారని ఆయన అన్నారు.
చిరంజీవి గారు మాత్రం నచ్చితే చాలా దగ్గరగా ఉండేలా చూసుకుంటారని శివాజీ తెలిపారు.
వైరల్ వీడియో: నిజమాబాద్ మేయర్ భర్త శేఖర్ పై ఆటో డ్రైవర్ దాడి