ఆ ఒక్క సినిమాతో బాలీవుడ్ లో కూడా సత్తాను నిరూపించుకున్న సత్యదేవ్?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరియర్ ను ప్రారంభించిన సత్యదేవ్ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ హీరో స్థాయికి చేరుకున్నాడు సత్యదేవ్.
హీరోగా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాలలో నటించాడు సత్యదేవ్.
ఇక ఇది ఇలా ఉంటే ఇటీవలే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం రామ్ సేతు.ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు.
ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు సత్యదేవ్.ఇటీవల అక్టోబర్ 25వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.
ఇందులో అక్షయ్ కుమార్ అద్భుతమైన రామ్ సేతు కట్టడం నాశనం కాకుండా కాపాడే ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటించారు.
కాగా అక్షయ్ తో పాటు జాక్విలిన్ ఫెర్నాండెజ్, సుస్రత్ బరుచా,సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు.
ఈ సినిమాలో సత్యదేవ్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. """/"/
ఈ సినిమాలో ఇప్పటివరకు సత్యదేవ్ నటించని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.
కాగా పలువురు ఈ సినిమాను చూసి నటుడు సత్యదేవ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా మొన్నటి వరకు టాలీవుడ్ సినిమాలలో తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్.
తాజాగా బాలీవుడ్ లో విడుదల అయిన రామ్ సేతు సినిమాతో అక్కడ కూడా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు.
ఆరోజే మోక్షజ్ఞ సినిమా మీద క్లారిటీ ఇవ్వనున్న బాలయ్య…