Sarath Babu: నటుడు శరత్ బాబు ఆస్తులు మొత్తం ఆ 13 కుటుంబాలకే.. కోట్ల విలువ చేసే ఆస్తులు?

తెలుగు సీనియర్ దివంగత నటుడు శరత్ బాబు( Sarath Babu ) తాజాగా అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన విషయం తెలిసిందే.

ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు బెంగుళూరులోని ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

ఆయన మరణంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీరని విషాదం నెలకొంది.ఆయన మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

"""/" / ఇది ఇలా ఉంటే శరత్ బాబుకి వారసులు లేరు అన్న విషయం తెలిసిందే.

కానీ వారసులు లేకపోయినప్పటికి ఆస్తులు ( Sarath Babu Properties ) మాత్రం కొందరికి చెందనున్నాయి.

శరత్ బాబు మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ఆయనకు సంతానం లేరు.ఈ నేపథ్యంలో తన సోదరి సోదరుల పిల్లలకు దాదాపు 13 వాటాల ఆస్తులను పంచనున్నట్లు తెలుస్తోంది.

ఇలా వారి వాట వారికి పంచిన కూడా శరత్ బాబు కంటూ కొన్ని ఆస్తులు ఉన్నాయి.

ఇక వాటి గురించి కూడా ప్రస్తుతం తగాదాలు మొదలయ్యాయని తెలుస్తోంది. """/" / ఒకవైపు శరత్ బాబు మరణంతో అందరూ బాధపడుతుంటే మరోకవైపు ఆస్తి గొడవలు( Property Disputes ) ఆయన అభిమానులను కలచి వేస్తున్నాయి.

శరత్ బాబు చనిపోక ముందు నుంచి కూడా ఈ ఆస్తులు విషయంలో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

కాగా శరత్ బాబుకి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో కూడా ఖరీదైన భవనాలతో పాటు ఎంతో విలువ చేసే ఆస్తులు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

అలానే మాల్స్, విల్లాలు వంటి ఖరీదైన ఆస్తులు కూడా శరత్ బాబు పేరున ఉన్నట్లు సమాచారం.

ఆయన ఆస్తుల 13 కుటుంబాలకు చెందనున్నట్లు సమాచారం.ఏది ఏమైనా శరత్ బాబు నటుడిగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి చివరికి ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించడం పట్ల చిత్ర పరిశ్రమ ఎంతో దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది.

‘హరిహర వీరమల్లు’ సినిమా మీద హైప్ పెంచుతున్నారా..?