మంచి మనస్సు చాటుకున్న సంపూర్ణేష్ బాబు.. చిన్నారి ఆపరేషన్ కోసం ఏం చేశాడంటే?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా సంపూర్ణేష్ బాబుకు నటుడిగా మంచి పేరు ఉందనే సంగతి తెలిసిందే.

హృదయ కాలేయం సినిమాతో సంపూర్ణేష్ బాబు నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టి ఆ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.

కొబ్బరిమట్ట సినిమా కూడా సంపూర్ణేష్ బాబు సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది.

బాల్యం నుంచి సంపూర్ణేష్ బాబుకు నటనపై ఎంతో ఆసక్తి ఉండేది.మహాత్మ అనే సినిమాలో చిన్నపాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం తర్వాత వరుసగా సినిమా ఆఫర్లను సంపాదించు కుంటూ నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారమైన బిగ్ బాస్ సీజన్1 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ హౌస్ వాతావరణం నచ్చక పోవడంతో హౌస్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చేశారు.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే సంపూర్ణేష్ బాబు సేవా కార్యక్రమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నారు.

తాజాగా చిన్నారి ఆపరేషన్ కోసం సాయం చేసి సంపూర్ణేష్ బాబు వార్తల్లో నిలిచారు.

తెలంగాణ రాష్ట్రంలోని రామన్నపేట గ్రామానికి చెందిన రమేష్, లావణ్య దంపతుల రెండు నెలల వయస్సు ఉన్న బాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు.

చిన్నారి ఆపరేషన్ కోసం సంపూర్ణేష్ బాబు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. """/" / తనకు వచ్చే రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని సంపూర్ణేష్ బాబు సేవా కార్యక్రమాల కొరకు ఖర్చు చేస్తుండటం గమనార్హం.

టాలీవుడ్ హీరోలు సినిమాల్లోనే కాదు తాము రియల్ లైఫ్ లో కూడా హీరోలమని ఇలాంటి ఘటనల ద్వారా ప్రూవ్ చేసుకుంటున్నారు.

సంపూర్ణేష్ బాబు నటుడిగా వరుస సినిమా ఆఫర్లతో బిజీ కావాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

ఆ హీరోయిన్ చేత బలవంతంగా దోశలు తినిపించిన ఎన్టీఆర్..?