జనసైనికుల్లో ఒకరిగా మారుతా.. 2024లో అసలు సినిమా చూస్తారు: నటుడు సమీర్
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు సమీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సమీర్ నటుడిగా మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.
కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో కూడా నటించారు.
ఇదిలా ఉంటే తాజాగా సమీర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు.
అంతే కాకుండా పవన్ కళ్యాణ్ గెలిస్తే పార్టీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పేశారు సమీర్.
ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ.నాగబాబు గారిని ఎక్కువగా కలుస్తుంటా.
లొకేషన్స్‌లో కళ్యాణ్ బాబు గారితో మాట్లాడుతుంటా.ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తరువాత.
ఈసారి చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది అని తెలిపారు.అలాగే రాబోయే ఎన్నికల్లో జనసేన ఎఫెక్ట్ చాలా ఉండబోతుందని లాస్ట్ టైం ఎన్నికలలో జస్ట్ ట్రైలర్ మాత్రమే చూశారని.
ఈసారి 2024 లో డైరెక్ట్‌గా సినిమానే చూడబోతున్నారు.ఇది గ్యారంటీ.
పవన్ మార్క్ చూపించబోతున్నారు అంటూ కాస్త స్ట్రాంగ్ గానే చెప్పాడు సమీర్.అలాగే జనాల్లో కూడా విపరీతమైన మార్పు వచ్చిందని.
తాను పుట్టి పెరిగింది వైజాగ్ లో అని తెలిపాడు సమీర్.ఇక ఈ మధ్య కాలంలో తనను పోటీ చేయమని అడిగగా అప్పుడు సమీర్ వద్దు బాబోయ్ అనేశాడట.
అలాగే పాలిటిక్స్ అనేవి తనను ఎట్రాక్ట్ చేయలేదని,అతనికి విపరీతమైన సపోర్ట్ ఉండి.ఒత్తిడి కూడా ఉన్నపటికీ.
తనను పవన్ కళ్యాణ్ పిలిచి పోటీచేయమని అడిగితే దెబ్బకి కిందపడిపోతానని.ఎందుకంటె తనకంటే పెద్ద పెద్ద వాళ్లు చాలామంది ఉన్నారని చెప్పు కొచ్చాడు సమీర్.
"""/" /
అలాగే వైజాగ్‌లో తనకు గ్యాంగ్‌లు ఎక్కువని .ఓల్డ్ మార్కెట్ నుంచి పూర్ణా మార్కెట్ వరకూ చాలామంది ఉన్నారని.
ఇకసినిమాల్లోకి వచ్చిన తరువాత సర్కిల్ ఇంకా బాగా పెరిగిందని చెప్పు కొచ్చాడు సమీర్.
అలాగే తాను పుట్టి పెరిగింది వన్ టౌన్ ఏరియాలోనే గ్యాంగ్‌లు ఉండేవని స్ట్రీట్ ఫైట్‌లు కూడా జరిగేవని.
కానీ రాజకీయాలలో వేరు.ఆ గ్యాంగ్‌లు వేరు.
రాజకీయాలు ఎందుకు వద్దనుకుంటున్నానంటే ఉన్నది కూడా ఊడిపోతుందనే భయం.నిజంగా పవన్ కళ్యాణ్ గారు పోటీచేయమని ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా ఆలోచిస్తా.
ఆయన పిలిస్తే.నూటికి నూరు శాతం పనిచేస్తాను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పరిస్థితి మారిపోతుంది.
జనసైనికుల్లో నేనూ ఒకరిగా మారతానేమో చూడాలి అని చెప్పు కొచ్చారు సమీర్.