Hansika Motwani : పబ్లిక్ లో హన్సికపై అలాంటి ఆరోపణలు చేసిన నటుడు.. ముదురుతున్న వివాదం?
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ హన్సిక ( Hansika )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా మంచి గుర్తింపుని ఏర్పరచుకుంది.
ఇకపోతే హన్సిక తాజాగా నటించిన చిత్రం పార్టనర్( Partner ).ఈ సినిమాలో ఆది హీరోగా నటించిన విషయం తెలిసిందే.
అలాగే ఇందులో రోబో శంకర్ కూడా ఒక కీలక పాత్రలో నటించారు.కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్.
"""/" /
ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో నిర్వహించగా ప్రెస్ మీట్ లో భాగంగా రోబో శంకర్ మాట్లాడుతూ హీరోయిన్ హన్సికపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రెస్ మీట్ లో భాగంగా రోబో శంకర్( Robot Shankar ) మాట్లాడుతూ.
దర్శకుడు ఎంత చెప్పినా హన్సిక నా కాలు తాకను అన్నారు.ఆమె నన్ను ముట్టుకోవడానికి ఇష్టపడలేదు.
హన్సిక తీరుకు దర్శకుడితో పాటు సెట్ లో ఉన్నవాళ్లమంతా ఆశ్చర్యపోయాము అని రోబో శంకర్ తెలిపారు.
అయితే పబ్లిక్ లో రోబో శంకర్ చేసిన ఆరోపణలు కొంత వివాదాస్పదం అవుతున్నాయి.
రోబో శంకర్ అనారోగ్యంతో బాధపడుతున్నారట. """/" /
ఆయనకు జాండిస్ సోకిందని, మానసిక పరిస్థితి కూడా బాగోలేదని కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనప్పటికీ ప్రెస్ మీట్ లో పబ్లిక్ లో అలా హన్సికపై షాకింగ్ కామెంట్స్ చేయడంతో అవికాస్త వివాదాస్పదంగా మారాయి.
ఇకపోతే హన్సిక విషయానికొస్తే.ఈమె గత ఏడాది అనగా 2022లో బిజినెస్ మాన్ సోహైల్ కతూరియాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమిళంలో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం హన్సిక చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి.తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతోంది.
తిండి గొంతుకు అడ్డుపడి ప్రాణాలు కోల్పోయిన సోషల్ మీడియా క్వీన్.. అందరూ షాక్..?