ఇప్పుడేంటి కథ మొత్తం చెప్పేయాల.. యాంకర్ సుమ పై హీరో రవితేజ ఫైర్?
TeluguStop.com
ఏదైనా ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే చాలు సుమ( Suma ) హంగామా మామూలుగా ఉండదు ఆ సినిమా ట్రైలర్ టీజర్ లాంచ్ కార్యక్రమాల నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ కార్యక్రమానికి కూడా సుమ యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటారు అయితే ఆగస్టు 15వ తేదీ పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఇందులో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో రవితేజ( Raviteja ) హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ ( Mr.
Bachchan ) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. """/" /
ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుమ రవితేజను ప్రశ్నిస్తూ ఈ సినిమాలో మీరు వింటేజ్ రవితేజను చూస్తారని హరీష్ శంకర్ చెప్పారు.
వింటేజ్ రవితేజ అంటే ఎలాంటి వింటేజ్ వెంకీ లాంటిదా, విక్రమార్కుడా, ఇడియట్.ఇలా ఏ వింటేజ్ అంటూ సుమ అడిగింది.
ఈ ప్రశ్నకి హరీష్ శంకర్ వింటేజ్ అంటూ ఒన్ వర్డా ఆన్సర్ ఇచ్చారు.
"""/" /
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో మీరు షాక్ మిరపకాయ్ సినిమాలలో నటించారు.
ఇందులో ఏ వింటేజ్ అని ప్రశ్నించగా మిరపకాయ్ అంటూ తిరిగి ఒక్క మాటలో సమాధానం చెప్పారు.
దీంతో సుమ అదిగో మీరు వన్ వర్డ్ సమాధానం చెప్పారని చెప్పడంతో వెంటనే రవితేజ అంటే ఇప్పుడు మిరపకాయ్ కథ మొత్తం చెప్పాలా అంటూ రవితేజ మాట్లాడారు.
వెంటనే సుమ అదిగో సుమ మీద సీరియస్ అయిన రవితేజ థంబ్ నెయిల్ వేసుకోండి అంటూ నవ్వించారు.
ఇక ఈ వీడియోని స్వయంగా హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై రామ్ చరణ్ రియాక్షన్ ఇదే.. గర్వపడేలా చేస్తానంటూ?