నీరజ్ చోప్రా అభిమాన హీరో ఎవరో తెలుసా?
TeluguStop.com
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకా విజేత నీరజ్ చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఒలంపిక్ క్రీడలలో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడంతో యావత్ భారతదేశం ఇతని పై ప్రశంసలు కురిపించింది.
ఈ క్రమంలో నీరజ్ చోప్రా బుధవారం తన అభిమాన హీరో రణ్‌దీప్ హుడాని కలుసుకున్నారు.
ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి దిగినటువంటి ఫోటోను హీరో రణ్‌దీప్ హుడా ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ నీరజ్ చోప్రాపై ప్రశంసలు కురిపించారు.
గతంలో 2018 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన అనంతరం నీరజ్ చోప్రాను మీడియా సమస్థ ఇంటర్వ్యూ నిర్వహించి మీ బయోపిక్ లో ఏ హీరో నటిస్తే బాగుంటుందని అడగగా అందుకు నీరజ్ రణ్‌దీప్ హుడా నటిస్తే బాగుంటుందని సమాధానాన్ని వెల్లడించారు.
అయితే వీరిద్దరూ హర్యాన రాష్ట్రానికి చెందినవారు కావడం పట్ల,అదేవిధంగా వీరిద్దరికీ క్రీడపై ఎంతో ఆసక్తి ఉండడం వల్ల వీరిద్దరి మధ్య స్నేహబంధం బలపడిందని చెప్పవచ్చు.
"""/"/
ఇకపోతే తాజా ఒలంపిక్ క్రీడలలో స్వర్ణం సాధించిన అనంతరం మీడియాతో ముచ్చటించిన నీరజ్ తాను హిందీ, ఇంగ్లీష్, పంజాబీ భాషలలో సినిమాలు చూస్తానని తనకెంతో ఇష్టమైన హీరో రణ్‌దీప్ హుడా నటించిన 'లాల్‌రంగ్'సినిమా అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు.
ఈ సినిమా మొత్తం హర్యానా యాసలో తెరకెక్కడం వల్ల తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా నీరజ్ చోప్రా వెల్లడించారు.
బర్త్‌డే కేక్‌పై ఈ క్యాండిల్స్ వాడుతున్నారా.. అయితే డేంజర్లో పడట్టే..??