విశ్వక్ సేన్ కి బాగా పొగురు… అందుకే లైలా సినిమా డిజాస్టర్ అయ్యింది: పృథ్వీ 

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న వారిలో నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) ఒకరు.

అయితే విశ్వక్ నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

విభిన్న రీతిలో ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టడంతో ఈయన వివాదాలలో చిక్కుకుంటూ వచ్చారు అయితే ఇటీవల విశ్వక్ నటించిన లైలా సినిమా (Laila Movie) విడుదల సమయంలో కూడా పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా ఫ్లాప్ గురించి సీనియర్ నటుడు బబ్లూ పృధ్వీరాజ్ (Babloo Prithveeraj) చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటుడు బబ్లూ పృధ్విరాజ్ కు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

ఈతరం హీరోలలో ఎక్కువగా యాటిట్యూడ్ చూపించే హీరోలు ఎవరు అనే ప్రశ్న వేయడంతో ఈయన ఏమాత్రం ఆలోచించకుండా టక్కున విశ్వక్ సేన్ అని చెప్పారు.

ఈయనకి ఉన్నటువంటి యాటిట్యూడ్ కారణంగానే లైలా లాంటి ఒక మంచి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు.

"""/" / ఈ సినిమా విడుదల సమయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

అయితే ఆ సమయంలో చాలా సున్నితంగా ఈ విషయాన్ని డీల్ చేయాల్సింది పోయి ప్రెస్ మీట్ అంటూ ఆటిట్యూడ్ చూపించారు దీంతో సినిమాపై దెబ్బ పడిందని తెలిపారు.

ఈ సినిమా విడుదల సమయంలో నేలకొన్న అపార్థం తొలగి పోవడానికి సర్ది చెప్పుకోవాల్సిన సమయంలో ప్రెస్ అనేది చాలా బలమైనది కానీ ప్రెస్ మీట్ పెట్టి వారిని అవమానించే విధంగా మాట్లాడటం మైనస్ గా మారిందని తెలిపారు.

ఇలాంటి సమయంలో ఒకసారి కాకపోయినా వందసార్లు క్షమాపణలు చెప్పడానికైనా సిద్ధంగా ఉండాలని బబ్లు పృథ్వీరాజ్ తెలిపారు.

"""/" / ఈ విషయాన్ని నేను విశ్వక్ సేన్ కి ఫోన్ చేసి మరీ చెప్పి గొడవ అంతా సర్దుకుపోయేలా చేద్దాం అనుకున్నాను.

కానీ ఆ టైంలో నేను ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయలేదు.రింగ్ అయినా కూడా ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడలేదు.

ఆ తర్వాత నేను కూడా తిరిగి అతనికి ఫోన్ చేయలేదు అంటూ విశ్వక్ సేన్ గురించి పృథ్వీరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Bets 10 Bonuses And Promotions: A Practical Welcome Bonus Breakdown