ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరోసారి ఫైర్ అయిన ప్రకాష్ రాజ్….సిగ్గుందా అంటూ?

సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) రాజకీయాలలోకి  వచ్చి జనసేన పార్టీని స్థాపించి పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఎంతో కష్టపడ్డారు.

ఈ విధంగా రాజకీయాలలో కొనసాగుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా(Deputy CM)  పదవీ బాధ్యతలను తీసుకున్నారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈయన వ్యవహార శైలి పై పలువురు విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా మరో సినీ నటుడు ప్రకాష్ రాజ్(PrakashRaj )  గతంలో తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు.

దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. """/" / తిరుపతి లడ్డు విషయంలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan, Prakash Raj ) ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు.

అయితే తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ నటుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

పవన్ కళ్యాణ్ గురించి ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజు మాట్లాడుతూ.

సనాతన ధర్మం, బిజెపి (Sanatana Dharma, BJP)అనుకూల వైఖరుల పైన కూడా పలు రకాల విమర్శలు చేయడం జరిగింది.

చేగువేరా, గద్దర్ బిజెపి పార్టీకి అసలు సంబంధం ఏంటి ఇలాంటి రాజకీయాలు చేయటానికి పవన్ కళ్యాణ్ కి కొంచమైనా సిగ్గుండాలి అంటూ ఈయన విమర్శించారు.

"""/" / వీరందరూ కూడా బిజెపి సిద్ధాంతిక వాటన్నిటికీ కూడా వ్యతిరేకంగా పనిచేశారని.

ఇప్పుడు వారందరినీ బీజేపీ అనుకూల వైఖరితో మాట్లాడడం సిగ్గుచేటు.హిందూధర్మం సనాతన ధర్మం ప్రమాదంలో ఉందని మాట్లాడుతున్నారు అసలు ప్రమాదంలో ఉన్నది హిందూ సనాతన ధర్మాలు కాదని, ప్రమాదంలో ఉన్నది బీజేపీ అంటూ ప్రకాష్ విమర్శించారు.

ఇలా పవన్ కళ్యాణ్ గురించి మరోసారి ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇక నటనపరంగా వీరిద్దరూ కూడా పలు సినిమాలలో కలసి నటించారు.వీరిద్దరూ నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి.

నటన వరకు మంచి మిత్రులు అయినప్పటికీ రాజకీయాల విషయానికి వస్తే వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి.

విశ్వనాథన్ భార్య చేసిన పనికి కార్ల్‌సన్ షాక్‌.. పొంగల్ వేడుకలో ఏం జరిగిందంటే?