రాజమౌళి ని తక్కువ అంచనా వేసిన నటుడు…కట్ చేస్తే ఆయన టాలెంట్ చూసి సారీ చెప్పాడట…? ఆయనెవరంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి.

( Rajamouli ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెలుతుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియాలో తనకు ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి.

మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో( Mahesh Babu ) పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. """/" / ఇక ఇలాంటి క్రమంలో రాజమౌళి ఈ సినిమాని ఒక విజువల్ వండర్ గా తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే రాజమౌళి కెరియర్ మొదట్లో సై సినిమా( Sye Movie ) చేసినప్పుడు ఆ సినిమాలో విలన్ పాత్రను పోషించిన ప్రదీప్ రావత్( Pradeep Rawat ) యొక్క క్యారెక్టర్ ను ఎలా ఉండాలో డిజైన్ చేసి స్కెచ్ ద్వారా తన క్యారెక్టర్ కి ఉండే లిమిటేషన్స్ ఏంటి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది కూడా పూర్తిగా వివరించారట.

ఇక అది చూసిన ప్రదీప్ రావత్ రాజమౌళి ఒక రెండు సినిమాలు తీశాడు కదా.

ఆ మాత్రం దానికే తనను తాను ఓవర్ గా ఊహించుకుంటున్నాడు.అయిన పేపర్ మీద ఉన్న డెప్త్ సినిమా షూటింగ్ చేసినప్పుడు వస్తుందా అంత పర్ఫెక్ట్ గా సినిమాను మనం చేయగలమా అంటూ తనలో తనే నవ్వుకున్నాడట.

"""/" / ఇక ఇలాంటి డైరెక్టర్లని మన కెరియర్ లో చాలా మంది ని చూశాం అనుకున్నడట.

కానీ రాజమౌళి డెడికేషన్ చూసి ముచ్చట పడిపోయిన ప్రదీప్ రావత్ ఆ తర్వాత రాజమౌళితోనే మీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను సారీ అని చెప్పాడట.

దాంతో రాజమౌళి కూడా మనం ఏ పని చేసిన పూర్తి ఎఫర్ట్ పెట్టీ చేస్తే అవుట్ పుట్ అనేది బెస్ట్ గా వస్తుందని నేను నమ్ముతాను అందుకే నేను చేసే ప్రతీ పని పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటాను అని చెప్పారట.

ఇక మొత్తానికైతే ప్రదీప్ రావత్ కి రాజమౌళి స్టామినా ఏంటో అర్థం అయిందనే చెప్పాలి.