నటుడు ప్రభుకి అస్వస్థత… ఆస్పత్రికి తరలింపు!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు వరుసగా అనారోగ్యానికి గురవుతూ మృతి చెందుతూ ఉండడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో తీవ్రవిషదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే తారకరత్న మరణం వార్త మరవకముందే తమిళనాడు మరణించారు.అయితే ఈ వార్తల నుంచి ఇంకా కోలుకోకముందే తమిళ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు.
చంద్రముఖి డార్లింగ్ వంటి సినిమాలలో ఎంతో అద్భుతమైన నటనను కనబరిచిన ఎంతోమంది తెలుగు అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.
"""/"/
ఈ క్రమంలోనే నటుడు ప్రభును ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
అయితే గత కొంత కాలంగా ఈయన కిడ్నీ వ్యాధి సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది.
ఆయనకు లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించామని.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా వైద్యులు తెలిపారు.
మరో రెండు రోజులపాటు ఆయనను అబ్జర్వేషన్లో ఉంచుకున్న అనంతరం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలియజేశారు.
"""/"/
ఇలా ఈయన ఉన్నఫలంగా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారని తెలియగానే అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఈయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఈయన చివరిసారిగా విజయ్ దళపతి వారిసు చిత్రంలో నటించారు.తమిళ నటుడు తిలకం శివాజీ గణేశన్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభు బాల నటుడిగా నటించి మెప్పించారు.
అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
వైవా హర్ష కొత్త బైక్ అన్ని లక్షలా.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!