ఆన్లైన్లో ఆర్డర్ చేసిన నటుడికి షాక్ ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్‌..!?

ఒకప్పుడు ఏమైనా షాపింగ్ చేయాలన్నా, ఏదైనా వస్తువు కొనాలన్నా, షాపు షాపు తిరిగి, బేరాలు ఆడి మరీ కొనేవారు.

అయితే మారుతున్న కాలంలో ఉరుకుల పరుగుల జీవితం లో ఎవరికి షాపు షాపు తిరిగి కొనే సమయం తీరిక లేకుండా పోయాయి.

దీంతో టెక్నాలజీ పెరిగి ఆన్లైన్ షాపింగ్ కు దారి తీసింది.ఇప్పుడు ఆన్లైన్ పుణ్యమాని ఏదైనా కొనాలన్నా, షాపింగ్ చేయాలన్నా ఆర్డర్ పెడితే చాలు ఇంటి వద్దకే వస్తువులు రావడంతో ఆన్లైన్ షాపింగ్ కు జనం అలవాటుపడిపోయారు.

కానీ ఆన్లైన్ షాపింగ్ మొదట బాగానే ఉన్నా రాను రాను రాజు గారి గుర్రం గాడిద అయినట్టు చాలా సందర్భాల్లో ఆర్డర్ పెట్టిన వస్తువులు కాకుండా బాక్సుల్లో వేరే వస్తువులు రావడం, కొన్నిసార్లు అసలు ఏమీ లేకపోవడం, ఒకవేళ ఏదైనా వస్తువు వచ్చినా చీప్ క్వాలిటీ వస్తువులు రావడం జరుగుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం.

అలానే ఇప్పుడు కూడా ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఓ సంఘటన జరిగింది.'అనుపమ' అనే వెబ్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న ప్రముఖ టెలివిజన్ నటుడు పరాస్ కల్నావత్ కు ఆన్లైన్ షాపింగ్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ షాక్ ఇచ్చింది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఇటీవల దసరా పండుగను పురస్కరించుకొని బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించింది.

అందులో భాగంగా పరాస్ కల్నావత్ రూ.6000 విలువైన నథింగ్ ఇయర్ ఫోన్స్ బుక్ చేయగా, డెలివరీ బాయ్ తెచ్చిన ప్యాక్ విప్పి చూసి ఒక్కసారిగా షాకయ్యాడు.

అతడు నథింగ్ ఇయర్ (1) ఇయర్ ఫోన్స్ బుక్ చేస్తే 'నథింగ్' ఏమీ లేదు.

ఖాళీగా ఉన్న బాక్స్ చూసి పరాస్ మతి పోయింది. """/"/ దీంతో షాక్ కు గురైన పరాస్ తేరుకుని వెంటనే ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.

తాను ఆరు వేల విలువైన ఇయర్ ఫోన్ ఆర్డర్ చేస్తే, వచ్చిన బాక్స్ లో ఏమీ లేదని ఫ్లిప్‌కార్ట్‌లో నిజంగా దిగజారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇది ఇలాగే కొనసాగితే ఇక ఫ్లిప్కార్ట్ ఎప్పుడు వినియోగించరని, దాని వైపే ఎవరు చూడరని పేర్కొన్నాడు.

వెంటనే పరాస్ ట్వీట్కు ఫ్లిప్కార్ట్ స్పందించి జరిగిన తప్పుకు క్షమాపణ తెలిపింది.తాము సాయం చెయ్యడానికే ఉన్నామని వెంటనే ఆర్డర్ ఐడి పంపిస్తే జరిగిన పొరపాటును సరిదిద్దు కుంటామని, అలాగే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అని తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు గతంలో చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.

సమంత నుంచి సంయుక్త వరకు సేవ కార్యక్రమాలు చేస్తున్న హీరోయిన్స్