60 వేల కోసం 4 సూపర్ హిట్ సినిమాల తాకట్టు… చివరికి ఏళ్ళ పాటు కోర్టు ఖర్చులు
TeluguStop.com
హాస్యనటుడు పద్మనాభం( Comedian Padmanabham ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆయన నటుడిగా ఎన్నో ఏళ్లపాటు తన హాస్యాన్ని ప్రేక్షకులకు పంచి ఆ తర్వాత దర్శకుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలోనే ఎవరూ చూడని హైట్స్ చూసేసి అంతే వేగంగా ఎవరు చూడనటువంటి లోతులకు వెళ్ళిపోయారు.
పద్మనాభం స్టైల్ చాలా మందికి విభిన్నంగా ఉంటుంది.ఆయన తీసిన దేవతా సినిమా( Devatha ) ఎంతో పెద్ద విజయం సాధించింది.
ఆ తర్వాత అలాగే పెద్ద హీరోలతో కాకుండా ఎన్నో ప్రయోగాలు చేసి ఆర్థికంగా చితికిపోయారు.
చేతిలో డబ్బు ఉంటే సినిమాలు తీసే వాళ్ళు చాలామంది ఉంటారు.కానీ ఇల్లు, ఒళ్ళు తాకట్టు పెట్టుకొని కూడా సినిమాలు తీసే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి పద్మనాభం తప్ప.
"""/" /
ఆయనే తీసిన సినిమాల విషయానికి వస్తే ఒకటి విజయం సాధిస్తే మరొకటి పరాజయం ఇలా ఒకటి తర్వాత ఒకటి అనేక సినిమాలు ఆయనకు కొద్దిగా కలెక్షన్స్ పరంగా బాగా ఉందనుకునే లోపే మరొక ప్లాప్ ఎదురచ్చేది.
అందుకే ఆయన చివరి వరకు ఏమీ సంపాదించలేదు ఉన్నది పోగొట్టుకున్నారు చివరికి ఒక రూపాయి డబ్బులు కూడా చేతుల్లో లేకుండా కన్నుమూశారు.
అయితే ఆయన సినిమా కోసం ఏదైనా చేసేవారు.ఎంతలా అంటే ఆయన తీసిన నాలుగు సూపర్ హిట్ సినిమాలను ఒక సినిమా విడుదల చేయడం కోసం ఒక వ్యక్తి దగ్గర 60000 కోసం తాకట్టు పెట్టుకున్నాడు.
ఆరు నెలల్లో డబ్బులు కట్టి అవి విడిపించుకుంటాను లేదంటే వాటి రైట్స్ అమ్మేసుకొని పైన వచ్చిన డబ్బు తనకు ఇవ్వాలని చెప్పాడట.
"""/" /
ఆరు నెలల్లో డబ్బులు తిరిగి ఇవ్వలేకపోవడంతో సదర్ వ్యక్తి వాటి రైట్స్ ని మూడు లక్షల రూపాయలకు అమ్ముకొని పద్మనాభం కి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు.
కేవలం 60 వేల డబ్బు కోసం మూడు లక్షల రూపాయలను సదరు వ్యక్తి సంపాదించుకోగా నెగిటివ్ రైట్స్ తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోలేదు చాలా ఏళ్లపాటు అది కోర్టులో కేసు జరిగింది.
చివరికి డబ్బు ఇచ్చిన వ్యక్తి కూడా చనిపోయిన తర్వాత అతని కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు తీసుకొని వాటికి సంబంధించిన రైట్స్ పద్మనాభంకి ఇచ్చారు.
అమరన్ సినిమాతో పది మెట్లు పైకి ఎక్కిన సాయిపల్లవి.. ఈ బ్యూటీకి తిరుగులేదుగా!