నయనతార ప్లాస్టిక్ సర్జరీ వార్తల్లో అసలు నిజం ఇదే.. మార్పులకు కారణాలివేనంటూ?

కోలీవుడ్ నటి, హీరోయిన్ నయనతార( Nayantara ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నయనతార ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ మరోవైపు సినిమాలను నిర్మిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు హీరోయిన్గా రాణిస్తోంది.అలా ప్రస్తుతం ఈమె కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

ఇది ఇలా ఉంటే నయనతార ప్లాస్టిక్ సర్జరీ( Plastic Surgery ) చేయించుకున్నట్లు గతంలో చాలా సార్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

"""/" / కానీ నయన్ వాటిని ఖండించారు.అయితే తాజాగా ఇదే అంశం పై నయనతార స్పందిచింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నా కనుబొమ్మలు( Eyebrows ) అంటే నాకు చాలా ఇష్టం.

వాటి ఆకారం ఎప్పుడూ మారుస్తూ ఉంటాను.ప్రతి రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్లకు ముందు వాటిని మార్చుతుంటాను.

వాటి కోసం ఎంతో సమయాన్ని కూడా వెచ్చిస్తాను.కనుబొమల ఆకారం మారినప్పుడల్లా ముఖంలో మార్పు కనిపిస్తుంది.

బహుశా అందుకే నా ముఖంలో మార్పులు వచ్చాయని ప్రజలు అనుకొని ఉంటారు.వాళ్లు అనుకున్నది నిజం కాదు, అలాగే డైటింగ్‌ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావచ్చు.

"""/" / ఒక్కోసారి బుగ్గులు వచ్చినట్లు కనిపిస్తుంటాయి.మరోసారి అవి లోపలికి వెళ్లినట్లు అనిపిస్తుంటుంది.

కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడవచ్చు.నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్‌ ఉండదు అని నయనతార సరదాగా తెలిపారు.

అయితే నయనతార తన ప్లాస్టిక్ సర్జరీ విషయంలో వస్తున్న వార్తలకి ఫుల్‌స్టాప్‌ పెట్టారు.

ప్రస్తుతం ఆమె తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు.