మా ఎన్నికలలో నరేష్ ప్యానల్ గెలుపు!
TeluguStop.com
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు ఆదివారం చాలా రసవత్తరంగా జరిగిన సంగతి అందరికి తెలిసిందే.
ఈ ఎన్నికలు ఇంత వరకు ఎప్పుడు జరగని విధంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాడివేడిగా సాగాయి.
ఇదిలా వుంటే ఈ ఎన్నికలలో మొత్తం 475 ఓట్లు పాలైనట్లు తెలుస్తుంది.ఇక నిన్న రాత్రి ఈ ఎన్నికల ఫలితాలని మా అసోషియేషన్ ప్రకటించింది.
ఇందులో నరేష్ ప్యానల్ ఊహించని స్థాయిలో భారీ మెజార్టీతో విజయం సాధించింది.అధ్యక్షుడుగా నరేష్ 268 ఓట్లు సొంతం చేసుకున్నాడు.
వైస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్ 240, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన హేమ 200 ఓట్లు తెచ్చుకున్నారు జనరల్ సెక్రెటరీగా జీవితా రాజశేఖర్, ట్రెజరర్ గా రాజీవ్ కనకాల భారీ ఆధిక్యం సొంతం చేసుకున్నారు.
ఈ ఎన్నికలలో నరేష్ ని ఎన్నికోవడం ద్వారా మెజార్టీ మా మెంబర్స్ కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అయ్యింది.
ఇక సోమవారం నరేష్ ప్యానల్ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం వుంది.