చివరి కోరిక తీరకుండా చనిపోయిన తారకరత్న.. ఆ టాటూ ఎవరిదంటే?
TeluguStop.com
నందమూరి తారకరత్న మరణంతో నందమూరి ఫ్యామిలీలో మరో విషాదం చోటు చేసుకుంది.ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందిన తారకరత్న చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు.
మెదడుకు సంబంధించిన సమస్యల వల్లే తారకరత్న మృతి చెందారని సమాచారం అందుతోంది.తారకరత్న మరణవార్తను ఆయన ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే చివరి కోరిక తీరకుండానే తారకరత్న మృతి చెందారు.సినిమాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని తారకరత్న రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు.
అయితే ఈ చివరి కోరిక తీరకుండానే తారకరత్న మృతి చెందారు.తారకరత్న మృతికి అభిమానులు, టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
బ్రెయిన్ డెడ్ కావడం వల్లే ఆయన మృతి చెందారని వైద్యుల నుంచి సమాచారం అందుతోంది.
"""/" /
తారకరత్న చేతిపై టాటూ ఉంది.సింహం ముద్రతో పాటు బాలయ్య ఆటోగ్రాఫ్ ఉండటం ఈ టాటూ ప్రత్యేకత.
బాబాయ్ బాలయ్యపై ఉన్న అభిమానంతో తారకరత్న ఈ టాటూ వేయించుకున్నారు.తారకరత్న కెరీర్ పరంగా సక్సెస్ కావాలని కష్టపడ్డ వారిలో బాలయ్య ఒకరు.
అయితే తారకరత్న నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధించగా మరికొన్ని సినిమాలు విజయాన్ని అందుకోలేదు.
"""/" /
తారకరత్న మరణవార్త విన్నప్పటి నుంచి బాలయ్యను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదని తెలుస్తోంది.
అంత బాధలో ఉన్నప్పటికీ తారకరత్న భార్య, పిల్లలకు మాత్రం బాలయ్యే ధైర్యం చెబుతున్నారని సమాచారం అందుతోంది.
వరుసకు బాబాయ్ అయినా బాలయ్య తారకరత్నను తండ్రిలా చూసుకున్నారు.తారకరత్నను అభిమానించే ఫ్యాన్స్ ఈ విషయాలు తెలిసి ఎంతగానో బాధ పడుతున్నారు.
తారకరత్న తన సినీ కెరీర్ లో ఎన్నో భిన్నమైన పాత్రలలో నటించి ప్రశంసలు అందుకున్నారు.
ఇతరులకు మంచి చేసే విషయంలో తారకరత్న ముందువరసలో ఉండేవారు.
రామ్ చరణ్ సినిమాకు అందుకే నో చెప్పా.. విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!