డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు వెంకటేశ్ సాయం చేశారు.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో నందకిషోర్( Actor Nanda Kishore ) ఒకరు.
సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈ నటుడు సినిమాలలో సైతం నటిస్తున్నారు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ నటుడు ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
ఎవరైతే కామ్ గా ఉంటారో వాళ్లలో ఆలోచించే శక్తి చాలా ఉంటుందని ఆయన అన్నారు.
నాది లవ్ మ్యారేజ్( Love Marriage ) అని సంతోషంగా ఉన్నామని నందకిషోర్ తెలిపారు.
10వ తరగతిలో లవ్ అని ఇంటర్ లో ప్రపోజ్ చేశానని డిగ్రీలో నా ప్రేమను ఆమె అర్థం చేసుకుందని నందకిషోర్ కామెంట్లు చేశారు.
ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నానని ముగ్గురు పిల్లలు అని ఆయన అన్నారు.
నేను వాలీబాల్ ప్లేయర్ నని నంద కిషోర్ పేర్కొన్నారు.యాక్టర్ కు ఫిట్ నెస్( Fitness ) అనేది చాలా ముఖ్యమని ఆయన అన్నారు.
"""/" /
కొన్నిసార్లు చెప్పిన డబ్బు కంటే తక్కువ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని నందకిషోర్ వెల్లడించారు.
జ్వరం వచ్చినా షూట్ లో పాల్గొన్నానని ఆయన అన్నారు.చిరంజీవి గారు నాకు స్పూర్తి అని ఆయన తెలిపారు.
విక్టరీ వెంకటేశ్( Victory Venkatesh ) సైతం నాకు స్పూర్తి అని ఆయన నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారని నంద కిషోర్ పేర్కొన్నారు.
ఎన్నో సందర్భాల్లో ఆయన నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. """/" /
వెంకటేశ్ గారు స్పిరిచ్యువాలిటీ( Spirituality ) గురించి ఎక్కువగా మాట్లాడతారని నందకిషోర్ పేర్కొన్నారు.
వెంకటేశ్ గారి టైమ్ ను డిస్టర్బ్ చేయకుండా నేను మాట్లాడానని ఆయన అన్నారు.
వెంకటేశ్ గారు ఒక సందర్భంలో చాలా సహాయం చేశారని నందకిషోర్ వెల్లడించారు.ఆ స్థాయిలో ఉన్నా మనకు ఆయన సహాయం చేశారని ఆయన అన్నారు.
నందకిషోర్ వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
చైనా పరువు గంగపాలు.. ఈ వీడియో చూస్తే డ్రాగన్ కంట్రీపై అభిప్రాయం మారిపోతుంది!