భర్తతో విడిపోతే ప్రపంచం అంతమైపోయినట్లా.. సానియామీర్జాకు నటుడి సలహా ఇదే!

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు సంబంధించి విడాకులు సర్వ సాధారణం అయిపోయాయి.సానియామీర్జా( Sania Mirza ) తన భర్తతో విడాకులు తీసుకోవడం ద్వారా కొంతకాలం క్రితం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే విడాకులు( Divorce ) తీసుకున్న తర్వాత సానియామీర్జాపై నెగిటివ్ కామెంట్లు ఒకింత ఎక్కువగా వినిపించాయి.

భర్తతో విడిపోతే ప్రపంచం అంతమైపోయినట్లా అంటూ సానియామీర్జాకు ఒక నటుడు సలహా ఇచ్చారు.

విడాకులకు సంబంధించి సానియామీర్జాకు నటుడు ఇచ్చిన సలహా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్( Actor Nabeel Zafar ) ఒక షోలో మాట్లాడుతూ ఏ మహిళ అయినా విడాకులు తీసుకోవడం దురదృష్టకరం అని అన్నారు.

కానీ భర్తతో విడాకులు తీసుకున్నంత మాత్రాన ప్రపంచం అంతా అయిపోయినట్లు చింతించకూడదని ఆ నటుడు చెప్పుకొచ్చారు.

"""/" / జీవిత భాగస్వామిని వెతుక్కోవాలని మరో పెళ్లి చేసుకోవాలని సానియామీర్జాకు కూడా మరో మంచి భాగస్వామి దొరికితే ఆమె తప్పకుండా పెళ్లి చేసుకోవాలని నటుడు కామెంట్లు చేశారు.

2010 సంవత్సరంలో సానియా మీర్జా, షోయబ్ మాలిక్( Shoaid Malik ) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ దంపతులకు 2018 సంవత్సరంలో ఇజహాన్ అనే ఒక కొడుకు జన్మించాడు.షోయబ్ తర్వాత రోజుల్లో సానియాకు విడాకులు ఇచ్చి నటి సనా జావెద్ ను( Sana Javed ) పెళ్లి చేసుకోవడం జరిగింది.

"""/" / షోయబ్ మాలిక్ కు ఈ పెళ్లి మూడో పెళ్లి కావడం గమనార్హం.

మరోవైపు నబీల్ జాఫర్ ఇచ్చిన సలహా విషయంలో సానియామీర్జా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

సానియామీర్జా కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సానియామీర్జాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.సానియా మీర్జా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని కెరీర్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

దానంకు మంత్రి పదవి ? కానీ ఆ టార్గెట్ పూర్తి చేస్తేనే