Mansoor Ali Khan : ఆ పాట కారణంగా వివాదంలో చిక్కుకున్న ప్రముఖు నటుడు.. వీడియో వైరల్?
TeluguStop.com
నటుడు మన్సూర్ అలీ ఖాన్( Mansoor Ali Khan ) ప్రేక్షకులకు అపరిచితమే.
దాదాపు 33 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం మన్సూర్ అలీ ఖాన్ 61 సంవత్సరాలు.అయినా కూడా ఇప్పటికే సినిమాలలో నటిస్తూ అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
తెలుగు తమిళం మలయాళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇది ఇలా ఉంటే మన్సూర్ అలీ ఖాన్ నటించిన డియో సినిమా( Deo Movie ) మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుంది.
"""/" /
ఇందులో హీరోగా నటించిన దళపతి విజయ్( Dalapati Vijay ) పుట్టిన రోజు సందర్భంగా లియోకు సంబంధించిన ఒక పాటను సినిమా టీం విడుదల చేసింది.
అయితే ఈ పాట కారణంగా మన్సూర్ ఒక వివాదంలో చిక్కుకున్నారు.ఆయనపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.
మన్సూర్ చేసిన పని కారణంగా ఆయనపై పోలీస్ కేసు నమోదయ్యే అవకాశం కూడా ఉంది.
అసలేం జరిగిందంటే మన్సూర్ అలీ ఖాన్ కొద్దిరోజుల క్రితం తన కారును డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళుతున్నారు.
ఆ సమయంలో కారులో లియో పాట నమ్మ రూల్స్ పాటను ఎక్కువ సౌండ్ ప్లే చేసి వింటూ ఉన్నారు.
"""/" /
డ్రైవింగ్ చేస్తూనే పాట బీట్‌కు తగ్గట్టు ఒళ్లు కదుపుతూ ఊగిపోయారు.
దీన్ని వెనకాల సీటులో కూర్చున్న వ్యక్తి వీడియో తీశాడు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.నీకు అసలు బుద్ధిలేదా.
డ్రైవింగ్ చేస్తూ అలా డ్యాన్స్ చేస్తావా?.సెలెబ్రిటీవి అయి ఉండి ఏంటా పిచ్చిపనులు మన్సూర్ సార్.
మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదేం దౌర్భాగ్యం.. స్కూటీపై వచ్చి పాలు దొంగతనం.. బెంగళూరు పరువు తీసిన నలుగురు యువకులు!