చిరంజీవిపై అభిమానంతో కాళ్లు విరగ్గొట్టా.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవికి సాధారణ ప్రేక్షకులతో పాటు సినిమా రంగానికి చెందిన వాళ్లలో అభిమానులు ఉంటారనే సంగతి తెలిసిందే.
అలా మెగాస్టార్ వీరాభిమానులలో మధునందన్ కూడా ఒకరు.మధునందన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను కాలేజ్ లో ఉన్న సమయంలో ఒక కథ రాసుకొని ఆ కథను షూటింగ్ కూడా చేశామని మధునందన్ వెల్లడించారు.
మంచి బ్యూటిఫుల్ కథతో తెరకెక్కించామని ఆయన తెలిపారు.అప్పటి చిన్న సినిమాకు పని చేసిన వాళ్లు ఇప్పుడు నిర్మాతలు, డైరెక్టర్లు , కెమెరామేన్లు అయ్యారని ఆయన తెలిపారు.
నా ఫ్రెండ్స్ లో చాలామంది సినిమా రంగంలో సక్సెస్ అయ్యారని మధునందన్ చెప్పుకొచ్చారు.
జనగాం ఎమ్మెల్యే కొడుకు పృథ్వీ కెమెరా తెచ్చి అప్పట్లో షూటింగ్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు.
నేను జాబ్ చేస్తున్న సమయంలో లవ్ లో పడ్డానని మధునందన్ కామెంట్లు చేశారు.
6 నెలలు ప్రేమ, 6 నెలలు పెళ్లి అని మధునందన్ చెప్పుకొచ్చారు.అమెరికాలో జాబ్ చేసి ఇండియాకు వచ్చిన తర్వాత తన ప్రేమ పెళ్లి జరిగిందని ఆయన తెలిపారు.
నేను చిరంజీవి ఫ్యాన్ అని మా కజిన్ కృష్ణ ఫ్యాన్ అని చిరంజీవి సినిమా హిట్ కాగా కృష్ణ సినిమా ఫ్లాప్ అయిందని ఆయన తెలిపారు.
వాడితో మెగాస్టార్ లా డ్యాన్స్ వేయాలని చెప్పగా వాడు వేయడానికి ప్రయత్నిస్తే కాలు విరగ్గొట్టానని ఆయన తెలిపారు.
"""/"/
వాడు 40 రోజులు బెడ్ రెస్ట్ కు పరిమితమయ్యాడని ఆయన కామెంట్లు చేశారు.
చిరంజీవిని చాలాసార్లు చూశానని అయితే డైరెక్ట్ గా కలవలేదని మధునందన్ చెప్పుకొచ్చారు.చిరంజీవి అంటే స్క్రీన్ గాడ్ అని మధునందన్ వెల్లడించారు.
బిజినెస్ లో తాను చాలా డబ్బు పోగొట్టుకున్నానని తనతో పాటు తన స్నేహితులు కూడా మునిగారని నా ఐదారేళ్ల కష్టం పోయిందని ఆయన చెప్పుకొచ్చారు.
జేసీ పరేషాన్ : కూటమి పార్టీలకు మరో తలనొప్పి