కరుణానిధి చేసిన కామెంట్‌ వలన జాతీయ అవార్డును కోల్పోయిన నటుడు?

ఈ ప్రపంచంలో కళాకారులకు ప్రేక్షకుల అభినందనలు, పురస్కారాలే అన్నింటికన్నా ఎక్కువ శక్తికి ఇస్తాయి.

ఆ తరువాతనే వారు తమ కళలను కనబరిచే క్రమంలో కొత్త శక్తిని నింపుకుంటారు.

మనదేశంలో అయితే ముఖ్యంగా సినిమా రంగం గురించి మాట్లాడుకోవాలి.దేశంలో నేడు సినిమా రంగం కంటే మెరుగైన రంగం మరొకటి లేదనే చెప్పుకోవాలి.

అందుకే ఇక్కడ నటీనటులకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రధానం చేస్తూ ఉంటారు.

అందులోనూ ఇక్కడ జాతీయ అవార్డు( National Award ) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అలాంటి జాతీయ అవార్డు ఒకటి వస్తే ఇక ఆ నటీనటుల జాతకాలు మారిపోతాయంతే.

"""/" / అయితే అలాంటి జాతీయ అవార్డు, కరుణానిధి( Karunanidhi ) కామెంట్‌ వలన లెజండరీ హీరో ఎం.

జి.రామచంద్రన్‌( M.

G.Ramachandran ) కోల్పోయాడు అంటే మీరు నమ్ముతారా.

ఇది వాస్తవం.ఉత్తమనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడుగా ఈయన రికార్డు సృష్టించారు.

అంతటి అరుదైన అవార్డును మరలా కోల్పోవడమేంటని అనుకుంటున్నారా? ఆయన దానిని అనుకోకుండా కోల్పోలేదు లెండి.

ఆయనే స్వయంగా వెనక్కి ఇచ్చేసారు.ఎందుకంటే? దానివెనుక పెద్ద కధే దాగి ఉంది.

"""/" / సుమారుగా 1971లో ఎం.జి.

రామచంద్రన్‌ హీరోగా ఎం.కృష్ణన్‌ దర్శకత్వంలో ‘రిక్షా కారన్‌’( Rickshawkaran ) అనే సినిమా వచ్చింది.

రిక్షా కార్మికుడు ప్రధాన పాత్రలో చేసిన ఈ సినిమా అప్పట్లో దుమ్ము దులిపేసింది.

పూర్తి మాస్‌ అంశాలతో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించి 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది కూడా.

దీన్ని పురస్కరించుకొని ఎం.జి.

ఆర్‌.తమిళనాడులోని దాదాపుగా 6,000 మంది రిక్షా కార్మికులకు రెయిన్‌ కోట్లు పంచారు.

కాగా ఈ చిత్రంలో ఎం.జి.

ఆర్‌.నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది.

చిత్ర యూనిట్‌ ఈ ఆనందంలో ఉండగా కరుణానిధి ఆ అవార్డుపై చేసిన కామెంట్‌ అప్పట్లో సంచలనం సృష్టించింది.

"""/" / విషయం ఏమిటంటే, ఎంజిఆర్‌కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తనవల్లే వచ్చిందని కరుణానిధి బోల్డ్ కామెంట్స్ చేసారు.

దాంతో ఒళ్ళు మండి ఆ అవార్డును ఎంజిఆర్‌ వెనక్కి ఇచ్చేశారు.ఇక అప్పట్లో ఇదొక పెద్ద సంచలమే అయ్యింది.

ఇక ఈ సినిమానుండి అనేక డబ్బింగ్ సినిమాలు వివిధ భాషల్లో విడుదల అయ్యాయి.

రిక్షావాలా, రిక్షావోడు, ఆటోరిక్షా.ఇంకా అనేక సినిమాలు ఈ సినిమా నుండి ప్రేరణ పొంది తీసినవే కావడం విశేషం.

పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే కథల్లో ఇవీ ఉండకూడదా..?