చిరంజీవి పవన్ లేకపోతే నాగబాబు ఎవరు.. కోట కామెంట్స్ వైరల్!

చిరంజీవి పవన్ లేకపోతే నాగబాబు ఎవరు కోట కామెంట్స్ వైరల్!

ఈ మధ్య కాలంలో ప్రముఖ నటులలో ఒకరైన కోట శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.

చిరంజీవి పవన్ లేకపోతే నాగబాబు ఎవరు కోట కామెంట్స్ వైరల్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో నాగబాబు కోట శ్రీనివాసరావు గురించి మాట్లాడుతూ కోట శ్రీనివాసరావుకు వయస్సు అయిపోయిందని వాడేమి మనిషి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

చిరంజీవి పవన్ లేకపోతే నాగబాబు ఎవరు కోట కామెంట్స్ వైరల్!

ఎప్పుడు ఉంటాడో ఊడిపోతాడో అంటూ నాగబాబు చేసిన కామెంట్ల గురించి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

నాగబాబు చేసిన కామెంట్ల గురించి ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నటుడిగా ఎవరూ గొప్ప కాదని ఎవరూ తక్కువ కాదని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలని ఆ రెండూ తనకు ఉన్నాయని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

చిరంజీవి, పవన్ లేకపోతే నాగబాబు ఏమిటని కోట శ్రీనివాసరావు ప్రశ్నించారు.నాగబాబు మామూలు నటుడని, అతను గొప్ప నటుడు కూడా కాదని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.

నాగబాబు గతంలో ప్రకాష్ రాజ్ ను తిట్టారని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.

నాగబాబు వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్ ఓటమికి కారణమని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.మోహన్ బాబు కోపిష్టి అయినా మంచి మనిషి అని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.

అయితే మోహన్ బాబు ఎవరికీ హాని చేయరని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. """/"/ ఇండస్ట్రీలో కులం ఉందని దానికి అందుకు సంబంధించి మరో ప్రశ్నే లేదని కోట శ్రీనివాసరావు అన్నారు.

గత 40 సంవత్సరాలుగా తాను కమ్మ వాళ్లు పెట్టిన ఫుడ్ తిన్నానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో 95 శాతం కమ్మవాళ్లు పెట్టిన ఫుడ్ తిన్నానని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.

5 శాతం మాత్రం మిగతా వాళ్లు పోషించారని కోట శ్రీనివాసరావు వెల్లడించారు. కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్లు చర్చనీయాంశం అవుతున్నాయి.