తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో… మా ప్రేమ పెరుగుతోంది అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

ఇలా పెళ్లి చేసుకున్న వారిలో నటుడు కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకరు.

గత ఏడాది ఆగస్టు నెలలో కూర్గ్ సమీపంలో ఈ హీరో నటి రహస్య( Rahasya ) ను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా వివాహం తర్వాత ఈ జంట ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు.

ఇక ఈ ఇద్దరు రాజావారు రాణి గారు అనే సినిమాలో నటించి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

"""/" / ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు చాలా ఆలస్యంగా వెల్లడించారు.

ఇలా ఐదు సంవత్సరాలు పాటు రహస్యంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టడమే కాకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇక వివాహం తరువాత రహస్య సినిమాలకు దూరంగా ఉంటూ సాధారణ గృహిణిల తన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

"""/" / ఇక పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం క అనే సినిమా( Ka Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

అయితే అభిమానులకు తాజాగా ఈయన మరొక శుభవార్తను కూడా తెలియజేశారు.తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం తన భార్య బేబీ బంప్( Rahasya Baby Bump ) కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టారు.

ఇలా తన భార్య బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన ఈయన మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది అంటూ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.

ఇలా రహస్య తల్లి కాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బాలయ్య కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడా..?