స్టార్ హీరో ఇంట్లోకి అద్దెకు దిగిన నటుడు కార్తీక్ ఆర్యన్... రెంటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీక్ ఆర్యన్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారిపోయారు.

ఇక తాజాగా ఈయన తెలుగులో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు.

షేహజాద్ అనే పేరుతో ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇంట్లో అద్దెకు దిగనున్నారు.షాహిద్ కపూర్ గత ఎడాది జూహూ ప్రాంతంలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇదే అపార్ట్మెంట్లో షాహిద్ కపూర్ తన భార్య పిల్లలు కలిసి ఉండేవారు అయితే ఈయన ప్రస్తుతం వర్లిలోని డూప్లెక్స్ హౌస్ కి షిఫ్ట్ అవడంతో ఈ ఇల్లు ఖాళీగా ఉంది దీంతో నటుడు కార్తీక్ ఆర్యన్ షాహిద్ కపూర్ ఇంట్లో దిగబోతున్నారు.

"""/"/ అయితే ఈయన ఈ ఇంటికి నెల నెల చెల్లించే అద్దె ధర తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ కావాల్సిందే.

షాహిద్ కపూర్ ఇంట్లో అద్దెకు ఉండడంతో కార్తీక్ ఆర్యన్ నెలకు 7.5లక్షల రూపాయల అద్దె చెల్లించబోతున్నారట.

అయితే ఇది కేవలం మొదటి సంవత్సరానికి మాత్రమే రెండవ ఏడాది రూ.8.

02 లక్షలు కాగా """/"/ మూడో ఏడాదికి ఏకంగా 8.5లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే ఈ అగ్రిమెంట్ ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ కింద 45 లక్షలు చెల్లించి అప్పజెప్పాల్సి ఉండగా ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది.

ఏది ఏమైనా నెలకు 7.5 లక్షల రూపాయల అద్దె అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

కెనడా చరిత్రలోనే అతిపెద్ద చోరీ .. త్వరలో లొంగిపోనున్న భారత సంతతి వ్యక్తి, లాయర్‌తో వర్తమానం