Prithviraj Sukumaran : ఆవులు చనిపోయి కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన వరద రాజమన్నార్.. మంచోడంటూ?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
పృథ్వీరాజ్ తమిళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
కాగా పృథ్వీరాజ్ తాజాగా విడుదలైన సలార్ సినిమా( Salaar )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు జయరామ్.
ఈ సినిమాలో వరదరాజ మన్నార్ అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ప్రభాస్ స్నేహితుడి పాత్రలో నటించి మెప్పించారు.
ఇది ఇలా ఉంటే తాజాగా నటుడు పృథ్వీరాజ్ తన గొప్ప మనసును చాటుకున్నారు.
ఒక కుటుంబానికి భారీగా విరాళం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.ఏం జరిగిందంటే.
"""/"/
తాజాగా కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన వెల్లియామామట్( Velliyamattom )లో దాదాపుగా 15 ఆవులు మృతి చెందాయి.
ఎండిన పచ్చిమిర్చి పొట్టుతో పాటు కలుషితమైన ఆహారం తినడంతో ఆ అవులు మృతి చెందాయని తెలుస్తోంది.
కాగా ఆ ఆవులను ఈ పశువులు ఇద్దరు యువకులు జార్జ్ 18, మాథ్యూ 15 లకు చెందినవి.
తన తండ్రి మరణం తరువాత వారిద్దరూ సుమారు 3 ఏళ్ల నుంచి ఆవులను పెంచుకుంటున్నారు.
ఒకవైపు పాఠశాలకు వెళ్తూ చదువుకుంటూనే డెయిరీ కోసం వారు కష్టపడుతున్నారు.మాథ్యూ చదువుతో పాటు ఆవులను కూడా పెంచుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ సమయంలో వారి ఆవులు చనిపోవడంతో మాథ్యూ, జార్జ్‌తో పాటు వారి తల్లి కుంగిపోవడం ఆపై వారు ఆస్పత్రి పాలు కావడం జరిగింది.
"""/"/
కాగా వీరు గతంలో రాష్ట్ర ఉత్తమ బాల పాడి రైతుగా అవార్డును గెలుచుకున్నారు.
ఆ ప్రాంతంలో ఉన్న డైరీ ఫామ్‌లలో వీరిది ఒకటి.డిసెంబర్ 31న వారి ఆవులు చనిపోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది.
ఆ కుటుంబం ఇబ్బందిని తెలుసుకున్న మలయాళ నటీనటులు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
ప్రముఖ నటుడు జయరామ్ వారికి భారీ సాయం అందించారు.తాజాగా ఆయనే స్వయంగా వారి ఇంటికి చేరుకుని రూ.
5 లక్షలు అందించడం విశేషం.ఆ చిన్నారుల కుటుంబానికి సాయంగా మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి( Actor Mammootty ) కూడా రూ.
లక్ష, సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా రూ.2 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని జయరామ్ పేర్కొన్నారు.
ఈ రోజు సాయంత్రం ఇద్దరూ పిల్లలకు ఆ డబ్బు కూడా అందజేయనున్నట్లు తెలుస్తోంది.
జయరామ్ ఆర్థిక సాయం చేసిన డబ్బు తన కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఏర్పాటు చేసుకున్న డబ్బు అని ఆయన తెలిపారు.
గతంలో తాను ఎంతో ప్రేమతో పెంచుకున్న ఆవులు కూడా కొన్ని కారణాల వల్ల మృత్యువాత పడ్డాయని గుర్తు చేసుకున్నారు.
మోక్షజ్ఞ ప్రశాంత్ మూవీ రద్దు… సంచలనమైన లేఖ విడుదల చేసిన మేకర్స్!