భార్యకు కారును బహుమతిగా ఇచ్చిన ప్రముఖ నటుడు.. ఖరీదెంతంటే?

భర్తలపై భార్యలకు ఉండే ప్రేమను తెలియజేసే పండుగను కర్వా చౌత్ అని అంటారు.

మనకు పెద్దగా తెలియకపోయినా నార్త్ ఇండియాకు చెందిన వాళ్లు ఘనంగా జరుపుకునే పండుగలలో కర్వా చౌత్ కూడా ఒకటి.

కర్వా చౌత్ జరుపుకునే టైమ్ లో భార్యలు భర్త ఆరోగ్యంగా ఉండాలని ఉపవాసం చేస్తారు.

భర్తపై ఉండే ప్రేమను తెలియజేయడం కోసం భార్యలు ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది.

దీపావళి పండుగకు కొన్ని రోజుల ముందు ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది.ఈ పండుగ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన గోవింద అతని భార్య సునీత ఆహుజాకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.భార్యకు బహుమతిగా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారుతో దిగిన ఫోటోలను గోవింద అభిమానులతో పంచుకున్నారు.

తన భార్య తన ప్రాణ స్నేహితురాలు అని జీవిత భాగస్వామి అని ఇద్దరు అందమైన పిల్లలకు తల్లి అని గోవింద చెప్పుకొచ్చారు.

"""/"/ భార్యపై తనకు ఉండే ప్రేమ వెల కట్టలేనిదని గోవింద పేర్కొన్నారు.

గోవింద కొనుగోలు చేసిన ఈ కారు ధర కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.

పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పండుగ జరుపుకుని అభిమానులతో ఫోటోలను పంచుకున్నారు.

"""/"/ పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని కోరుకుంటూ కర్వా చౌత్ పండుగను జరుపుకుంటారు.

ఈ ఏడాది 24, 25 తేదీలలో కర్వాచౌత్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఏడాదిలో రెండు రోజుల పాటు కర్వాచౌత్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది.ఈ పండుగను జరుపుకోవడం వల్ల కుటుంబ సభ్యులు సైతం క్షేమంగా ఉంటారని మహిళలు నమ్ముతారు.

సౌత్ ఇండియాలో కూడా కొంతమంది ప్రజలు ఈ సాంప్రదాయంను పాటిస్తూ ఉండటం గమనార్హం.

గుజరాత్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి కారణం ఇదే…