జ్యోతిక బిహేవియర్ బాలేదు.. భార్యాభర్తలు కలిసుండాలి.. నటుడి సంచలన వ్యాఖ్యలు!

కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో జ్యోతిక ( Jyothika ) ఒకరు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సైతం జ్యోతిక నటిస్తుండగా అత్తామామలతో ఆమెకు విబేధాలు ఉన్నాయని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.

తమిళ నటుడు జ్యోతిక గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ నటుడు, జర్నలిస్ట్ బైల్వాన్ రంగనాథన్( Bayilvan Ranganathan ) ఈ కామెంట్లు చేశారు.

ఓటు వేయడానికి జ్యోతిక రాలేదని ఆమె మామయ్యకు ప్రశ్నలు ఎదురయ్యాయని ఆ సమయంలో సూర్య తండ్రి మానసిక స్థితి ఎలా ఉంటుందని బైల్వాన్ రంగనాథన్ ప్రశ్నించారు.

కొడుకు మాత్రమే వచ్చి ఓటేస్తాడని కోడలు రాలేదంటే ఆయన ఎలా ఫీల్ అవుతాడని బైల్వాన్ రంగనాథన్ కామెంట్లు చేశారు.

నలుగురికి ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.ఈ విషయాలలో హీరోయిన్ జ్యోతిక ప్రవర్తన బాలేదని ఆయన తెలిపారు.

"""/" / అత్తామామాల విషయంలో విధేయతతో ఉండాలని బైల్వాన్ రంగనాథన్ పేర్కొన్నారు.భార్యాభర్తలు కలిసి కనిపిస్తే బాగుంటుందని ఆయన వెల్లడించారు.

బైల్వాన్ రంగనాథన్ చేసిన సంచలన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ కామెంట్ల గురించి జ్యోతిక నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.

జ్యోతిక ప్రస్తుతం ఇప్పటివరకు ఈ కామెంట్లపై స్పందించలేదు. """/" / జ్యోతిక కెరీర్ పరంగా బిజీ కావాలని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

జ్యోతిక, సూర్య( Surya ) త్వరలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటించనున్నారని తెలుస్తోంది.

నువ్వు నేను ప్రేమ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివరి మూవీ కావడం గమనార్హం.

జ్యోతికకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరుగుతోంది.జ్యోతికకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఆమె ఇప్పటికీ ఒకింత భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.జ్యోతిక కెరీర్ ను భారీ స్థాయిలోనే ప్లాన్ చేసుకుంటున్నారు.

ఆ సినిమా కథ చెబితే తెలుగు హీరోలందరూ రిజెక్ట్ చేశారు: వెంకీ అట్లూరి