నేను పెళ్లి చేసుకోను.. అందుకు మా పేరెంట్స్ కూడా హ్యాపీ: అవసరాల శ్రీనివాస్
TeluguStop.com
నటుడిగా దర్శకుడిగా రచయితగా తన మల్టీ టాలెంట్‌తో ఎన్నో సినిమాల్లో పనిచేసిన అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నటుడిగా అష్టా చమ్మా తొలి సినిమాతో పేరు సంపాదించుకున్న ఇతను ఎప్పుడు ఏదైనా కొత్తగా చేయాలని చూస్తుంటాడు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయం గురించి స్పందించాడు.తన పెళ్లి విషయంలో ఒక డెసిషన్ తీసుకున్నాడు అవసరాల శ్రీనివాస్.
అయితే తన పెళ్లి విషయం గురించి తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడే చేశానని తెలిపారు.
మరి ఇంటర్వ్యూ లో భాగంగా అవసరాల శ్రీనివాస్ తన పెళ్లి విషయంలో ఎలాంటి విషయం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.
అతని తల్లి ఊరీ పేరు మండపేట, అయితే చదువుకున్నది హైదరాబాద్‌లో, ఆ మధ్యలో రెండేళ్లు పాటు కాకినాడలో చదివాడట.
ఇకపోతే తాను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నేను నిర్ణయించుకున్నప్పుడు.ఆ విషయాన్ని ఇంట్లో చెప్పాను.
మా నాన్న గారు అయితే నా నిర్ణయం చెప్పగానే జలస్ ఫీల్ అయ్యారు.
ఎందుకుంటే నా ట్రాక్ ఆయనకు బాగా నచ్చింది అని నవ్వుతూ తెలిపారు.ఒక ఏజ్ వచ్చిన తరువాత తీసుకునే నిర్ణయం కాదు ఇది.
నేను పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం తీసుకోవడానికి పెద్ద కారణాలు ఏమీ లేవు. """/"/
అనుభవంతోనే నిర్ణయాలు తీసుకోవడం అనేది మన భ్రమ తప్పితే రియాలిటీలో అలా ఉండదనేది నా ఫీలింగ్ అంటూ తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకున్నారు అవసరాల శ్రీనివాస్.
అయితే అవసరాల శ్రీనివాస్ ఇలాంటి షాకింగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అని అభిమానులు ఆలోచిస్తున్నారు.
అష్టా చమ్మా, పిల్ల జమీందార్, అంతకు ముందు ఆ తరువాత, నాన్నకు ప్రేమతో, లాంటి సినిమాలలో తన నటనతో ఆకట్టుకున్నాడు.
ఇతనికి స్క్రీన్ రైటింగ్, థియేటర్ ఆర్ట్స్‌లో కూడా అపారమైన అనుభవం ఉంది.ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఆ పని మరే హీరో చేయలేరు… అల్లు అర్జున్ దమ్మున్న హీరో: రష్మిక