అల్లరి నరేష్ కు కలిసి వచ్చిన మే నెలలోనే ఉగ్రం విడుదల… సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యేనా?

అల్లరి నరేష్ ( Allari Naresh ) తాజాగా ఉగ్రం ( Ugram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమెడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇప్పటివరకు ఈ సినిమాపై పలువురు రివ్యూ ఇస్తూ అల్లరి నరేష్ తన ఉగ్రం చూపించారు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఇలా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.

ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి.అలాగే అల్లరి నరేష్ సినిమాలో విడుదల విషయంలో కూడా ఒక సెంటిమెంట్ ఉందని తెలుస్తుంది.

"""/"/ అల్లరి నరేష్ తన సినీ కెరియర్ లో ఎక్కువగా మే నెలలో విడుదలైనటువంటి సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అయ్యాయి.

ఈయన మొదటి నటించిన చిత్రం అల్లరి ( Allari ) సినిమా 2002 మే 10వ తేదీ విడుదల అద్భుతమైన విషయం అందుకుంది.

ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాకుండా ఈ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.

ఇలా అల్లరి సినిమా మంచి సక్సెస్ అయింది ఇక మే నెలలో విడుదలైనటువంటి కితకితలు(Kitha Kithalu) సీమటపాకాయ్ (Seematapakay)సినిమాలు కూడా మంచి హిట్ అందుకున్నాయి.

"""/"/ ఇక నరేష్ సోలో హీరోగా కాకుండా మహేష్ బాబుతో కలిసి నటించిన చిత్రం మహర్షి( Maharshi ).

ఇందులో ఈయన మహేష్ బాబు స్నేహితుడు పాత్రలో నటిస్తారు.ఈ సినిమా కూడా మే నెలలోనే విడుదల అయ్యి నరేష్ పాత్రకు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది.

నరేష్ సినిమాలన్నీ మే( May )లో విడుదలయ్యి మంచి సక్సెస్ అయ్యాయి.అలాగే ఉగ్రం సినిమా కూడా మే నెలలో విడుదల అయింది.

ఈ సినిమా ఇప్పటివరకు మంచి టాక్ సొంతం చేసుకున్న కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనే విషయం తెలియాల్సింది మరి ఉగ్రం సినిమాలో నరేష్ మే సెంటిమెంట్( May Sentiment ) వర్క్ అవుట్ అవుతుందా లేదా వేచి చూడాలి.

పుష్ప2 1400 కోట్లు.. మిస్ యూ 2 కోట్లు.. సిద్దార్థ్ ఇప్పటికైనా తీరు మార్చుకుంటారా?