Satyam Rajesh : అలీ విమానం మిస్ కావడం వల్ల ఈ నటుడి జాతకం మారిపోయిందట.. ఏం జరిగిందంటే?

నటుడు కమెడియన్ సత్యం రాజేష్( Satyam Rajesh ) గురించి మనందరికీ తెలిసిందే.

మొదటి విలన్ అవుదామని సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాజేష్ అవకాశాల కోసం రెండు, మూడేళ్ల పాటు స్టూడియోల చుట్టూ తిరిగారట.

సర్‌ విలన్‌గా చేస్తాను అవకాశం ఇవ్వండి అంటే నువ్వా? విలన్‌గానా?అంటూ పెదవి విరిచేవారట.

ఈ క్రమంలో సరైన తిండి లేక బరువు తగ్గిపోవడంతో ముఖం కూడా పీక్కుపోయి, సన్నగా చిన్న పిల్లాడిలా కనిపించడంతో, విలన్‌ పాత్రలు అడిగితే నవ్వుకునేవారట.

అయినా కూడా పట్టు వదలకుండా ఆడిషన్స్‌ వెళ్లిన రాజేష్‌కు తొలుత హీరో ఫ్రెండ్స్‌ గ్రూపులో ఒకడిగా క్యారెక్టర్లు రావడం మొదలు పెట్టాయి.

వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, గుర్తింపు తెచ్చుకునే సమయంలోనే సుమంత్‌ సత్యం మూవీ రాజేష్‌ కెరీర్‌ను మలుపుతిప్పింది.

"""/" / అందులో సుమంత్‌( Sumanth ) స్నేహితుడి పాత్ర కోసం తొలుత అలీని అనుకున్నారు.

అప్పటికే సినిమా షెడ్యూల్‌ మొదలవడంతో అలీ కూడా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది.అదే సమయంలో ఆయన దుబాయ్‌ వెళ్లారు.

ఇండియాకు తిరిగి వచ్చే సమయంలో అక్కడ విమానం క్యాన్సిల్‌ అవడంతో రెండు రోజులు దుబాయ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఈలోగా అనుకున్న షెడ్యూల్‌ ఆలస్యమవుతుండటంతో దర్శకుడు సూర్య కిరణ్‌ రాజేష్‌ను ఆ పాత్రకు తీసుకుందామనుకున్నారట.

ఇదే విషయాన్ని నిర్మాత నాగార్జున దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తొలుత ఒప్పుకోలేదు.అలీ వచ్చేదాకా వేచి చూద్దాం అని అన్నారట.

దీంతో సూర్య కిరణ్‌ కలగజేసుకుని రాజేష్‌ నటనతో పాటు, నా కామెడీ టైమింగ్‌పై నాకు నమ్మకం ఉంది.

అవకాశం ఇవ్వండి అనడంతో ఎట్టకేలకు నాగార్జున ఒప్పుకొన్నారు. """/" / ఆ విధంగా సత్యం సినిమాలో సతీష్‌ పాత్రకు రాజేష్‌ ఎంపికయ్యారు.

తన నటన, కామెడీ టైమింగ్‌, పులి రాజా అంటూ ఆయన చేసే హంగామా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

ఈ సినిమా తరువాత సత్యం రాజేష్ మళ్ళీ కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు.ఈ సినిమాతో రాజేష్‌ బాబు కాస్తా.

సత్యం రాజేష్‌ అయ్యారు.అలా కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే కాకుండా వైవిధ్యమైన పాత్రలను రాజేష్‌ పోషిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.ఇటీవల విడుదలైన మా ఊరిపొలిమేర 2( Maa Oori Polimera 2 ) మూవీలో తన నటనతో మరో మెట్టు ఎక్కారు.

చేతబడులు చేసే వ్యక్తి కొమిరి పాత్రలో జీవించేశారు.ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రాణించడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

యూకే: ఈ గుడ్డు చాలా స్పెషల్.. అందుకే ఈ ధరకు అమ్ముడుపోయింది..?