ఆ రోజు రాజమౌళి తో సహా అందరు నేను చనిపోయాను అనుకున్నారు…
TeluguStop.com
మనలో చాలా మంది సినిమాల్లో నటించడం అంటే చాలా ఈజీ సినిమా హీరోలకి ఏ కష్టం ఉండదు వాళ్ళ లైఫ్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనుకుంటాం.
కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ కష్టపడతారు.70 సంవత్సరాలకి దగ్గర్లో ఉన్న చిరంజీవి ఇవాళ్టికి కూడా షూట్ ఉన్న రోజు మార్నింగ్ 6 గంటలకే సెట్ లో ఉంటారు అంటే మాములు విషయం కాదు మనలో చాలా మంది 8 గంటల వరకు అసలు నిద్రనే లేవము.
ఇవే కాదు వాళ్ళు షూట్ లో ఉన్నప్పుడు ప్రాణాలకి తెగించి రిస్కీ షాట్స్ చేస్తూ ఉంటారు ఆలా చేయడం వల్ల వాళ్లకి చాలా దెబ్బలు తగులుతుంటాయి.
కానీ వాటికీ సంభందించిన చికిత్స చేసుకొని మళ్ళి షూట్ కి వెళ్తారు.అలాంటి నటులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు అందులో అజయ్ ఒకడు.
ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు పొందిన అజయ్ మొదట్లో రాజమౌళి సినిమాలోనే ఎక్కువగా కనిపించేవాడు.
అయితే ఆయన ఈ మధ్య ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.
అందులో భాగంగానే ఆయన తన కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమా ఇప్పటికి తన ఫేవరేట్ సినిమా అనే చెప్పారు.
"""/" /
అలాగే ఈ సినిమా టైం లో జరిగిన కొన్ని విషయాలని షేర్ చేసుకున్నారు.
ఈ సినిమా లో విలన్ గా నటించిన అజయ్ క్లైమాక్స్ ఫైట్ షూట్ చేస్తున్నప్పుడు అనుష్క ని చంపే సీన్ ఒకటి వుంది అదే టైములో అక్కడ ఉన్న క్రేన్ ఆపరేటర్ల మధ్య ఒక చిన్న మిస్ కమ్యూనికేషన్ జరగడం వల్ల అజయ్ తలకి, కాలికి బలంగా దెబ్బ తగిలిందట అది చూసినా రాజమౌళి వాడు చచ్చిపోయాడు అని """/" /
గట్టిగా అరిచాడట కానీ దేవుడి దయ వల్ల నేను బతికిపోయాను అని చెప్పాడు కానీ తలకి తగిలిన గాయం వల్ల తనకి బ్లడ్ వస్తుందో షూటింగ్ లో వేసిన డమ్మి బ్లడ్ వల్ల తనకి బ్లీడింగ్ అవుతుందో అర్థంకాక కొద్దిసేపు ఆయన తల తిరిగిపోయింది అని చెప్పారు.
ప్రస్తుతం అజయ్ తెలుగులో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారిపోయాడు ఆయన కెరియర్ లో పోకిరి, విక్రమార్కుడు, ఇష్క్, మిర్చి గబ్బర్ సింగ్, సరిలేరు నికెవ్వరు లాంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ పోషించి ఇప్పటికీ కూడా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినీ అభిమానుల్లో తనకంటూ ఒక మంచి స్థాయిని స్థానాన్ని కల్పించుకున్నాడు.
ఈ అతిపెద్ద చైనీస్ రోబో ఫిష్ చూశారా.. దాన్ని చూసిన సందర్శకులకు షాక్..?