‘పొట్టేల్’ సినిమాని నిలబెట్టింది విలన్ అజయ్ మాత్రమే.. అంతకుమించేం లేదు?

హీరోయిన్ అనన్య నాగళ్ల నటించిన పొట్టేల్ సినిమా( Pottel Movie ) గురించి మీడియాలో కొన్ని రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది.

వెరైటీ ప్రమోషన్స్ నుండి కాంట్రవర్సీ ప్రశ్నలు, అనన్య సమాధానాలు.వెరసి పొట్టేల్ నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంది.

ఈ క్రమంలోనే నిన్న విడుదలైన పొట్టేల్ సినిమా గురించి కాసేపు ఇక్కడ చర్చిద్దాం.

పొట్టేల్ ట్రైలర్ విడుదల చేసిన తరువాత ఈ సినిమా కథ ఎలా ఉంటుందో జనాలకి ఓ ఐడియా వచ్చింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాపైన అందరికీ ఆసక్తి కలిగింది.ఈ సినిమా కథ మొత్తం 80వ దశకంలో సాగుతుంది.

విధర్భ (మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్) ప్రాంతంలోని "గుర్రంగట్టు" ఊర్లో ఈ కథ మొత్తం జరుగుతుంది.

ఆ ఊరి గ్రామ దేవత బాలమ్మ పుష్కరానికి ఓ సారి జాతర చేసి పొట్టేల్‌ను బలి ఇవ్వాల్సి వస్తుంది.

ఎందుకంటే అలా చేస్తే, ఆ ఊరి పటేల్‌కు బాలమ్మ పూనుతుందని జనం నమ్మకం.

అలా తరతరాలుగా ఆ నమ్మకం జనాల్లో బాగా నాటుకుపోవడంతో ఆ ఆచారం బలపడుతూ వస్తుంది.

అయితే పరంపరగా పటేల్ వంశానికి బాలమ్మ పూనుతూ ఉంటుంది.కానీ పటేల్ (అజయ్)కి చిన్న తనం నుంచి బాలమ్మ పూనదు.

కానీ బాలమ్మ పూనినట్టుగా నాటకం ఆడతాడు.ఈ విషయం తెలిసిన గంగాధర్ (యువ చంద్ర) బాలమ్మ నుండి పొట్టేల్‌ను ఎలా కాపాడాడు అన్నదే మిగతా కథ.

నెగటివ్ షేడ్స్ ఉన్న పటేల్( Patel ) పాత్రలో నటుడు అజయ్ చాలా అద్భుతంగా నటించాడు.

వాస్తవానికి ఈ సినిమాకి అజయ్ కీ రోల్ పోశిషించాడు.పొట్టేల్ కథలో చాలా లేయర్లు మనం చూడవచ్చు.

జనాల మూఢ నమ్మకాలు.బలహీన వర్గాలను ఎలా అణచి వేశారు? చదువు కోసం ఒకప్పుడు ఎంతలా కష్టపడేవారు? వంటి విషయాలు బాగా చూపించారు.

ఈ నేపథ్యంలోనే పొట్టేల్ కథ పూర్తిగా చదువు ప్రాముఖ్యత చుట్టూ తిరుగుతుంది.పటేల్‌ను ఎదురించి తన కూతుర్ని చదివించుకోవాలనుకున్న తండ్రి తపన, తాపత్రయాన్ని ఇందులో "దర్శకుడు సాహిత్" ( Director Sahit )బాగానే చూపించాడు.

కానీ అక్కడక్కడా తడబడ్డాడు. """/" / దర్శకుడు ఈ కథను చెప్పే స్టైల్ బాగుంది.

కానీ మేకింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవలసి ఉండాల్సింది.ఎందుకంటే, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తీసినప్పుడే మంచి విజయాన్ని సాధిస్తుంది.

పొట్టేల్‌లో మంచి సందేశం, మంచి మేకింగ్, ఆర్టిస్టుల పర్పామెన్స్ ఇలా చాలా ఉన్నాయి.

కానీ ఆ పాత్రలో ప్రయాణం చేసే ఓపిక, సహనం సగటు ప్రేక్షకుడికే ఉండదు.

80s నేపథ్యానికి తగ్గట్టుగా సెట్ వర్క్, క్యాస్టూమ్స్ ఇలా అన్నీ సెట్ అయ్యాయి.

ఇక శేఖర్ చంద్ర( Shekhar Chandra ) మ్యూజిక్, ఆర్ఆర్ బాగుంది.టెక్నికల్ టీంను వాడుకోవడంలో మేకర్‌గా సినిమాను తీసిన తీరులో దర్శకుడుగా పాస్ అయ్యాడనిపిస్తుంది.

కానీ అందరినీ ఆకట్టుకునేలా చేయడంలో రైటింగ్‌లో కాస్త తడబడినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది.

"""/" / అజయ్ విలన్‌గా చాన్నాళ్ల తరువాత సత్తాను చాటుకున్నాడు.కొత్త కుర్రాడు యువ చంద్రకు మంచి పాత్ర దక్కింది కాబట్టి ఓకే అనిపించుకున్నాడు.

అనన్య నాగళ్లకు కాస్త ఇంపార్టెన్స్ ఉన్న కారెక్టర్ దొరికినప్పటికీ, చెప్పుకోదగ్గ పాత్ర అయితే కాదు.

నోయల్‌, శ్రీకాంత్ అయ్యంగార్, ఛత్రపతి శేఖర్ ఉన్నంతలో బాగా నటించారు.మిగిలిన ఊరి పాత్రల్లో చాలా వరకు అందరూ సహజంగానే నటించారు.

అయితే ఈమధ్య మనోభావాలు బాగా దెబ్బతింటున్నాయి కాబట్టి, మరి ఓ వర్గం మనోభావాలు దెబ్బతింటాయేమో చూడాలి మరి!.