ఆ విషయంలో ఎన్టీఆర్ అసలు మనిషే కాదు… సంచలనంగా మారిన అజయ్ కామెంట్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ తో మంచి సక్సెస్ అందుకొని నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు ఎన్టీఆర్ ( NTR ) ఒకరు.

రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా నేషనల్ స్టార్ గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

త్వరలోనే కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానుంది.ఈ సినిమా కోసం ఎంతోమంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

"""/" / ఎన్టీఆర్ బాలనటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఇక ఈయన నటుడిగా మాత్రమే కాకుండా డాన్సర్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు ఇక ఎన్టీఆర్ మంచితనం గురించి ఆయన నటన గురించి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఎన్నో విధాలుగా తెలియజేశారు.

ఈ క్రమంలోనే నటుడు అజయ్( Ajay ) సైతం ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అజయ్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ కాంబో ఆఫ్ డాన్స్ అంటూ వెల్లడించారు.

"""/" / ఈయన ఎంతో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తారని ఒక్కసారి కంటితో చూస్తే డాన్స్ చేసేస్తారని నాకు తెలిసిన వరల్డ్ బెస్ట్ డాన్సర్ తారక్ అంటూ తెలియజేశారు.

ఇక నటన పరంగా మాత్రమే కాదు డైలాగ్స్ విషయంలో కూడా ఎన్టీఆర్ కి ఎవరు సాటిరారని తెలిపారు.

డైలాగ్స్ విషయంలో ఎన్టీఆర్ మనిషే కాదని ఒక రోబోలా చెబుతారని అజయ్ వెల్లడించారు.

ఇకపోతే దేవర సినిమా గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు రాజమౌళితో సినిమా చేస్తున్న హీరోలు తదుపరి సినిమా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ ఉంది కానీ ఆ సెంటిమెంట్ ను దేవర సినిమా చెరిపేస్తుందని, ఈ సినిమాని ఎన్టీఆర్ తో పాటు కొరటాల కూడా చాలా కసిగా చేస్తున్నారు అంటూ హాజహ్ వెల్లడించారు.

గోపీచంద్ విశ్వం మూవీ ట్విట్టర్ రివ్యూ.. మ్యాచో స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారా?