ఎట్టకేలకు కాబోయే భర్త ఫోటో షేర్ చేసిన నటి… ఫోటో వైరల్!

సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అభినయ( Abhinaya ) ఒకరు.

ఈమె పుట్టుకతోనే చెవుడు మూగ సమస్యలతో పుట్టినప్పటికీ ఏ మాత్రం విశ్వాసం కోల్పోకుండా తనని తాను నిరూపించుకుంటూ వచ్చారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో సాధారణ వ్యక్తుల కొనసాగడం అంటే కష్టతరం అలాంటిది అభినయ  మాటలు రాకపోయినా చెవులు వినపడకపోయినా అద్భుతమైన ఆదరణ పొంది ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.

"""/" / ఇక తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అభినయ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఈమె హీరో విశాల్( Vishal ) తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తల పై స్పందిస్తూ అవును తాను ప్రేమలో ఉన్నానని గత 15 సంవత్సరాలుగా నా స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నానని తెలిపారు.

ఇలా తన ప్రియుడు గురించి చెప్పిన కొద్దిరోజులకే తన ప్రియుడితో కలిసి నిశ్చితార్థం ( Engagement ) జరుపుకున్న ఫోటోలను ఈమె షేర్ చేశారు.

"""/" / ఇక తన కాబోయే భర్త ఎలా ఉంటారు ఏంటి అనే విషయాలను ఇప్పటివరకు అభినయ ఎక్కడ షేర్ చేయలేదు.

అయితే మొదటిసారి ఈమె  తన కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

కాబోయే భ‌ర్త‌తో క‌లిసి గంట కొడుతున్న ఫోటోని షేర్ చేసి.మార్చి 9న త‌న ఎంగేజ్‌మెంట్  జ‌రిగిన‌ట్లుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిన‌య తెలియ‌జేసింది.

ఈమె షేర్ చేసిన ఫోటోల‌ను బ‌ట్టి అత‌డి పేరు కార్తీక్‌ ( Karthik ) గా తెలుస్తోంది.

అత‌డి సోష‌ల్ మీడియా పేజీలో అత‌డి పేరు స‌న్నీ వ‌ర్మ‌6గా ఉంది.అత‌డు ఎక్క‌డి వాడు, ఏం చేస్తాడు అన్న విష‌యాలు తెలియాల్సి ఉంది.