Abbas : నేను సినిమాలకు దూరం అవడానికి కారణమిదే : ఒకప్పటి స్టార్ హీరో అబ్బాస్

తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరో అబ్బాస్ ( Abbas )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

అంతేకాకుండా డ్రీమ్ బాయ్ గా కూడా అప్పట్లో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకున్నాడు అబ్బాస్.

ప్రేమదేశం( Premadesam ) సినిమాతో ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు అబ్బాస్.ఆ తర్వాత కాలంలో ఆయన సినిమాలకు దూరమవుతూ వచ్చారు.

"""/" / ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో అబ్బాస్ తాను సినిమాలకు దూరం అవడానికి గల కారణం ఏంటి అన్న విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ.నేను అనుకోకుండానే నటుడిని అయ్యాను.

సాధారణ ప్రేక్షకుడిలానే నా తొలి చిత్రం కాదల్‌ దేశం తెలుగులో ప్రేమదేశం ప్రీమియర్‌కి వెళ్లాను.

మరుసటి రోజు మా ఇంటి ముందు సముద్రాన్ని తలపించే అభిమానగణాన్ని చూసి ఆశ్చర్యపోయాను.

వారెందుకు నాపై అంత ప్రేమ కురిపించారో అప్పుడు నాకు అర్ధం కాలేదు.19 ఏళ్ల వయసులో డబ్బు సంపాదించేందుకు సినిమాని ఒక మార్గంగా ఎంపిక చేసుకున్నాను.

కెరీర్‌ ప్రారంభంలో విజయాలు అందుకున్నాను. """/" / తర్వాత ఫెయిల్యూర్‌నీ చూశాను.

కనీస అవసరాలకూ డబ్బుల్లేని పరిస్థితి ఎదురైంది.అవకాశం కోసం నిర్మాత ఆర్‌.

బి.చౌదరిని కలిశాను.

పూవెలి చిత్రంలో నటించమన్నారు.కొన్నాళ్లకు నా పనిని నేను ఆస్వాదించలేకపోయాను.

బోర్‌ కొట్టేసింది.అందుకే సినిమాలకు దూరమయ్యాను.

న్యూజిలాండ్‌( New Zealand) కి వెళ్లాను.కుటుంబాన్ని పోషించేందుకు బైక్‌ మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గాను పనిచేశాను అని అబ్బాస్‌ చెప్పుకొచ్చారు.

ఆర్ఆర్ఆర్, పఠాన్ సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసిన పుష్ప2.. అసలేం జరిగిందంటే!