పుచ్చకాయ సాగులో నారు కుళ్ళు తెగులను నివారించెందుకు చర్యలు..!
TeluguStop.com
పుచ్చకాయ సాగును( Cultivation Of Watermelon ) అన్ని కాలాల్లో సాగు చేసే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.
రైతులు ఒకే రకం పంటలు కాకుండా పుచ్చకాయ లాంటి పంటల సాగు వైపు కాస్త అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే పుచ్చకాయ సాగు విధానంపై పూర్తి అవగాహన కల్పించుకున్న తర్వాతనే సాగుచేపడితే ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.
"""/" /
పుచ్చకాయ సాగు మొలక దశలో ఉన్నప్పుడు నారు కుళ్ళు తెగులు ఆశించి తీవ్ర నష్టం కలిగించే అవకాశం చాలా ఎక్కువ.
నారు కుళ్ళు తెగులు జెనస్ పాలిథియం( Genus Polytheum ) అనే ఫంగస్ వల్ల సంక్రమిస్తుంది.
ఈ ఫంగస్ మట్టిలో ఉండే పంట అవశేషాలు జీవించి ఉంటుంది.భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు బాగా దగ్గరగా నాటితే ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది.
ఇక కలుషితమైన పరికరాల వల్ల ఇతర పంట మొక్కలకు చాలా వేగంగా వ్యాప్తి చెంది ఊహించని నష్టం తెస్తుంది.
పంట మొలక దశ ఉన్నప్పుడు లేదంటే ఎదిగే దశలో ఉన్నప్పుడు ఈ నారు కుళ్ళు తెగులు పంటను ఆశిస్తుంది.
మొక్కలు కుళ్ళిపోయి చనిపోతాయి. """/" /
తెగులు నిరోధక సర్టిఫైడ్ కంపెనీ విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.
మొక్కల మధ్య సూర్యరశ్మి, గాలి బాగా తగిలితట్లు దూరంగా నాటుకోవాలి.విత్తనాలను లేదా మొక్కలను చాలా లోతులో నాటకూడదు.
తెగులు గుర్తించిన వెంటనే ఆ మొక్కలను పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.
నత్రజనిని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఉపయోగించాలి.నీటిని రాత్రి సమయంలో కాకుండా కేవలం పగటి సమయంలో మాత్రమే పంటకు అందించాలి.
పొలంలో ఉపయోగించే పనిముట్లను ఇంట్లో వాడే బ్లీచ్ తో బాగా శుభ్రం చేసి ఉపయోగించాలి.
విత్తనాలను మెటలాక్సేల్-M తో విత్తన శుద్ధి చేస్తే ఈ తెగులు వచ్చే అవకాశం ఉండదు.
పొలంలో కప్టాన్ 31.8% లేదా మెటలాక్సిల్-M 75% ను మొక్కల ఆకులపై పిచికారి చేసి ఈ తెగులను వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 9, శనివారం2024