కాలీఫ్లవర్ పంట సాగులో నల్ల కుళ్ళు, కుళ్ళు తెగుళ్ళ నివారణకు చర్యలు..!
TeluguStop.com
కాలీఫ్లవర్ ( Cauliflower )పంటను చల్లని తేమతో కూడిన వాతావరణంలో సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చు.
అయితే ఈ పంటను పూర్తి విస్తీర్ణంలో ఒకేసారి కాకుండా విడతల వారీగా వేసుకుంటే ఆదాయం బాగుంటుందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ పంట సాగుకు ఉదజని సూచిక 5.5 నుంచి 6.
5 వరకు ఉండే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.
పంట వేయడానికి ముందు వేసవికాలంలో ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు, 30 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ( Potash )వేసుకుని కలియ దున్నుకోవాలి.
ఒక ఎకరాకు 150 గ్రాముల విత్తనాలు అవసరం.కిలో విత్తనాలకు మూడు గ్రాముల థైరం లేదా కార్బండిజంతో విత్తన శుద్ధి చేయాలి.
"""/" /
నారును నేలపై లేదంటే ట్రేలలో పెంచుకోవచ్చు.నేలపై పెంచుకుంటే దాదాపుగా 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండే నారుమడులను ఏర్పాటు చేయాలి.
ఈ నారు మడులలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.నేలపై నారును పెంచితే ఆకు తినే పురుగుల బెడద కాస్త ఎక్కువ.
ఇవి ఆశించకుండా ఒక లీటరు నీటిలో 2.5 మి.
లీ మాలాథియాన్( Malathion ) ను కలిపి పిచికారి చేయాలి.నారు వయసు 25 రోజులు దాటాక ప్రధాన పొలంలో విత్తుకోవాలి.
ఒక ఎకరాకు 15వేల నారు మొక్కలు అవసరం.మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకొని నేలలోని తేమశాతాన్ని బట్టి వారానికి ఒకసారి నీటి తడి అందించాలి.
ఈ పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగించే నల్ల కుళ్ళు తెగుళ్లను తొలి దశలోనే గుర్తించి నివారించాలి.
మొక్క ఆకులపై ముదురు గోధుమ రంగు చుక్కలు ఏర్పడి వాటి పరిమాణం క్రమంగా పెరుగుతుంటే ఆ మొక్కకు నల్ల కుళ్ళు తెగుళ్లు సోకినట్టే.
స్త్రేప్టో సైక్లిన్ 5మి.లీ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
కుళ్ళు తెగుళ్లు పంటను ఆశిస్తే మొక్క నుండి పువ్వుకు కూడా వ్యాప్తి చెంది మొక్కతో పాటు పువ్వు కూడా కుళ్ళిపోతుంది.
కాపర్ ఆక్సి క్లోరైడ్ 3గ్రా.ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి తొలి దశలోనే అరికట్టాలి.
మెగా ఫ్యామిలీని తొక్కేయాలని చూస్తుంది ఎవరు..?