నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి: అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్

వేసవి కాలం నేపథ్యంలో రాబోయే మూడు నెలలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి( Waterlogging ) రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్( Additional Collector Srinivas ) ఆదేశించారు.

మంగళవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ ను పరిశీలించి,అందులో ఎంత మేర నీరు ఉందో తెలుసుకొని,సాగర్ నుండి విడుదలైన నీరు నేరుగా రిజర్వాయర్ కు చేరేలా చూడాలని ఆధికారులు సూచించారు.

నీటిని కాల్వల నుండి ఎవరు దారి మళ్ళించకుండా చూడాలన్నారు.మిషన్‌ భగీరథ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను సందర్శించి నీటి సరఫరా ప్రణాళిక గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో అంతర్గత లీకేజీలు అరికట్టి,అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరథ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌( Mission Bhagiratha Treatment Plant ) ద్వారా సురక్షిత తాగునీటి సరఫరా చేయాలన్నారు.

తాగునీటి సమస్యపై ఎవరు ఫోన్‌ చేసినా వెంటనే స్పందించి పరిష్కరించాలని తెలిపారు.పంచాయతీ కార్యదర్శులు,ఏఈలు తాగునీటి ఎద్దడి లేకుండా సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు తాగునీటి వృథాపై అవగాహన కల్పించాలని అన్నారు.

అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును సందర్శించి ఎలక్షన్ సిబ్బంది తనిఖీలు ఎలా నిర్వహిస్తున్నారని రికార్డులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పీ ఏఈ,మిషన్ భగీరథ ఏఈలు,తహసీల్దార్ జె.ప్రమీల,ఆర్ఐ సైదులు, పంచాయితీ సెక్రటరీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

వర్షాకాలంలో పెరుగును దూరం పెట్టేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!